పుట:AndhraRachaitaluVol1.djvu/290

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసికొన జాలము. శౌమారికాఖండము నందలి గౌరీశంకర వివాహ ఘట్టమున వీరికవితాధార జాహ్నవి వలె నిట్లు పొంగారుచున్నది.

క. కనిపెట్టుచు బ్రాహ్మణవరు

లనూన పద్ధతిని సాగునట్లొసరుపగా

దనయాన్వయముల జెప్పం

గను బూని హిమాద్రి యనియె గన్యక దీనిన్.

క. పితరులు దౌహిత్రిగ నా

సుతగా నెఱుగంగ దగును శుభగుణ నిలయన్

మతిమద్వర్య నొసంగెద

హితమిది లోకాళి కన్న యిచ్ఛ పొలయుటన్.

క. అనియూరకుండె; నల్లుని

దనబడు వంశం బెఱుంగ డయ్యెంగానన్

మునిముఖుల నడిగె వంశం

బన నెయ్యది శంభుని దని యంద ఱెఱుగమిన్.

మ. వనజాక్షుం డిటు పల్కె; నెవ్వరిని నీ వార్తన్ వచింపంగ నే

రని వారిం గని ప్రశ్న మీవడిగినన్ రా దు త్తరం బెవ్వరై

నను గుర్తింపగరాని యన్వయము వింతగాంచు నీయల్లునే

యనుమోదంబున బ్రశ్నచేయు; మతడే యావార్తలం జెప్పెడున్.

క. వినుమహియే యహిపాదము

ల నెఱుంగుంగాని యెవ డిలాస్థలి జెప్పం

గను జాలునె తెలియుదు: నని

తన గోత్రము జెప్పడేని తగ మద్భగినిన్.

క. ఒసగంగ రాదు: శంభున

కసమాన్వయు డగుట: ననగ నమ్మాటకు సం