Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడు గ్రంథములు భట్టుమూర్తిరచించె నని వ్రాసియున్నది" (అముద్రితగ్రంథ చింతామణి - 1886 ఫిబ్రవరి) ఈ వ్రాతను జూచిన 'సుజనరంజని' సూరి నడపినటులు సువిశదము.

సూరి కవితా నిపుణుడు. వచనరచనా మార్గదర్శకుడు. సంఘసంస్కారపరుడు. భాషాపోషకుడు. ఇతడు ప్రాచీనుల యడుగుజాడలలో నడిచెను. ఇతనికి నన్నయ చెప్పినది వేదము. ఇతనికడ శాస్త్రాది గ్రంథములతో నిండిన భాండాగార ముండెడిదని ప్రసిద్ధి.

బ్రౌనుదొర ప్రోత్సాహము - లక్ష్మీనరసింహశ్రేష్టి హెచ్చరిక, సూరి భాషాసేవకు జేయూత నిచ్చినవు. సూరి మరణించినను నాతని కీర్తి జ్యోతి బాలవ్యాకరణ నీతిచంద్రికా స్నేహమున నధునాతనాంధ్ర భాషాభవనములో దేదీప్యమానముగ వెలుగుచునే యున్నది.