పుట:AndhraRachaitaluVol1.djvu/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చతురతకును, సామెతలు చక్కగ వాడుటకును, ప్రయోగ విశేషములు ప్రదర్శించుటకును చిన్నయసూరి శ్రద్ధ తీసికొనెను. రసానుగుణములగు వృత్తులు, పాత్రోచితములగు పదములు నీతిచంద్రికయందే పరికింపవలయును. సూరి సూత్రాంధ్రవ్యాకరణము - ఆంధ్ర ధాతుమాలయు నాంధ్ర సాహిత్యపరిషత్తు ప్రకటించినది.

ఇతడు సంస్కృతాంధ్రములలో జక్కనిరీతిగల కవిత సంతరించెను. పచ్చపనృప యశోమండనము చూడుడు.

"గగనంబట్లు రసప్రపూర్ణ విలసత్కందంబులు న్మీఱి య
భ్రగసాలంబుగతిన్ సితచ్ఛదములన్ భాసిల్లి మేరుక్రియన్
జగదామోద సుపర్ణభాస్వరముగా జానొంది పచ్చావనీ
శగుణంబు ల్గణుతించుకోశ మిది యిచ్చ న్మెచ్చుగావించెడిన్
గుణస్య బాధికాం వృద్ధిమ కృతవాన్ పాణినిః పురా
అబాధితగుణాం వృద్ధిమకరో త్పచ్చపప్రభుః"

సంస్కృతాంధ్రకవితలు రెండును ధారాళగతినుండి పండిత హృదయముల నాకర్షించుచున్నవి.

చిన్నయసూరి వ్యాకర్తయే కాదు, కావ్యకర్త కూడను. భాషాభిజ్ఞుడే కాదు, సంగీతకళావిజ్ఞుడు కూడను. సుస్థిరయళ స్సంపాదకుడే కాదు, "సుజనరంజనీ పత్రికా" సంపాదకుడు కూడను.

సూరి కంఠధ్వని చాల శ్రావ్యముగ నుండెడిదట. ఆయన సంగీతము కొంతనేర్చెను. సూరి 'సుజనరంజని' యను మాసపత్రిక కొన్నియేండ్లు వెలువరించినట్లు తెలియును. అందు బట్టపరీక్షార్థులకు విద్వాంసులకు గలుగు భాషాసందేహములకు చక్కని సమాధానములు ప్రచురింపబడుచుండెడివట. "ఇదివరలో జిన్నయసూరి ముద్రింపించుచు వచ్చిన సుజనరంజనీ యను పత్రికయందు పై నుదహరించిన