పుట:AndhraRachaitaluVol1.djvu/286

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జనమంచి శేషాద్రి శర్మ

1882

తెలగాణ్య వైదిక శాఖీయులు. తల్లి: కామాక్షి. తండ్రి: సుబ్రహ్మణ్య శర్మ. జన్మస్థానము: నెల్లూరు మండలములోని అలువాయపురము. నివాసము: కడప. జననము: 4-7-1881 సం|| విరచిత కృతులు: 1. బ్రహ్మపురాణము. 2. బ్రహ్మాండపురాణము. 3. కౌమారికా ఖండము (స్కాందాంతర్గతము) 4. సర్వమంగళాపరిణయము (మహాకావ్యము) 5. హాలాసమాహాత్మ్యము 6. లలితోపాఖ్యానము 7. శ్రీమద్రామాయణము 8. సంగ్రహరామాయణము 9. విచిత్రపాదుకా పట్టాభిషేకము 10. పాండవాజ్ఞాతవాసము. 11. దైవజ్ఞ సార్వభౌమ విజయము 12. సీతా స్వయంవరము 13. సువ్రత 14. కీరవాణి 15. మనోరంజని. 16. యతిధర్మ ప్రదీపిక 17. సతీతిలక. 18. కడపమండల చరిత్ర 19. ఉదయగిరి ముట్టడి 20. శ్రీకృష్ణావతార తత్త్వము 21. శ్రీరామావతార తత్త్వము (కొన్ని యముద్రితములు) 22. కేదారారుణాచల ఖండములు (స్కాందాంతర్గతములు) 23. హృదయానందము (కల్పిత ప్రబంధము - పద్యసంఖ్య మూడువేలు) 24. శ్రీశంకర గురువర చరితము (3 వేల పద్యములు) 25. కవివిలాసము ఇత్యాదులు.

అధునాతనాంధ్రకవులలో బురాణవాజ్మయమువంక జూచినవారు నలుగు రైదుగురు మాత్రము. వారిలో భారతరామాయణముల నాదరించినవారి సంఖ్య పెద్దది. సంస్కృతములో అష్టాదశ పురాణములు కలవు గదా ! వానిని జూచుచున్న వారు తక్కువ నే డనువాదవాజ్మయమునకు, విశేషించి పౌరాణగాధలకు మనవా రంతగా జెవు లొగ్గక పోవుటచే గాబోలు భారత రామాయణాదులైన నాలుగైదు పురాణములకంటె దెలుగుబాసలో బురాణములు లేవు.

ఈకొఱత కొంతవఱకు దీర్చిన కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగారు యావదాంధ్రమునకు నభివందనీయులు. వీరు ప్రస్తుతము కడపలోని