పుట:AndhraRachaitaluVol1.djvu/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శా. నానాసాధు సభాసదార్య సుమనోనాళీకనాళ ప్రణా

ళీ నిర్వ్యజ నిపీయమాన సువచో లీలామృతా స్వాదనా

పౌన:పుస్యరసోదయుండ సుమన: పద్మైకసంవేశిత

శ్రీ నాథుండ శతావధాన కవితా సింహాసనాధీశుడన్.

మ. తునిరాజేంద్రుశతావధాన కవితాతుష్టాత్ము గావించి యా

యన సమ్మాన విభూతిమై 'సుకవితాయద్యస్తి రాజ్యేనకి'

మ్మనురీతిన్ గవిరాజటంచును జనం బాబాల గోపాలమున్

వినుతింప న్విలసిల్లువాడ గవితా విద్యానవద్యాకృతిన్.

నీలాద్రిరాజుగారు కవియు, శతావధానియు గాక మంచి విమర్శకుడని 'ఆంధ్రక్షత్రియులు' అనిన చిన్నపుస్తకము వలన దెల్లమగును. శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు 'ఆంధ్రులచరిత్రము' లో నాంధ్ర దేశమును బరిపాలించిన కాకతీయులు సూర్యవంశక్షత్రియులని తొలుత వ్రాసి, తరువాత జతుర్థకులజులని మరల వ్రాసిరి. పరస్పరవిరుద్ధముగ నిటులు వ్రాయుటకు గారణమేమని యడుగ మొదటిది భ్రమయనియు, రెండవది ప్రమ యనియు బిమ్మట వాదించిరి. అప్పుడు మన కవిరాజుగారు శ్రీ రావుగారి వ్రాతను సప్రమాణముగ గాదని వాదించి కాకతీయులు క్షత్రియులే యని యీ పుస్తకములో దేల్చివ్రాసిరి.

ఈ కూర్పునకు బీఠికవ్రాయుచు విమర్శకాగ్రేసరులు కాశీభట్టబ్రహ్మయ్యశాస్త్రిగారు చిట్టచివర నిట్టులుతమయభిప్రాయము వెలిబుచ్చిరి.

"...ప్రతాపరుద్రాదులు శూద్రులను భ్రమ పల్వురకు గలిగినది. నేనును నందులోని వాడనేగాని శ్రీ కవిరాజుగారు వ్రాసిన యీగ్రంథము చూచినతరువాత నే నిదివఱకు దలచినది తప్పని గ్రహించి దిద్దుకొన వలసినవాడ నయితిని."

ఈ యుభయవాదములలోని సాధుతాసాధుతలు నిర్ణయించుకొనుటకిది సమయముగాదు. కవిరాజుగారు చక్కని విమర్శన శక్తి కలవారని