Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తళుకుకనకంబునకు బరీమళము వోలె కావ్యనిర్మాణ మతి యశస్కరము మీకు.

ఆంధ్ర మేఘసందే శావతారికలో గవిరాజుగారు తమ సహాధ్యాయనిచే జెప్పించుకొన్నటులు వ్రాసిన పద్యమిది.

ఈక్షత్రియకవి, మోడేకుఱ్ఱు సంస్కృత పాఠశాలా పండితులు ఆకొండి వ్యాసలింగశాస్త్రిగారిసన్నిధానమున సంస్కృతాంధ్రసాహితి సంగ్రహించెను. పాణినీయమునను గొంత ప్రవేశము కలిగించు కొనెను. కవిత్వము మంచి చిక్కని పలుకుబళ్లతో నుండి చక్కగ నడపింపగల నేర్పరు లీయన. పెద్దన, తిమ్మనార్యుడు మున్నగు వారిశైలి వీరి కవిత కొరవడి. భాష నిర్దుష్టము, శిష్టసమ్మతముగ నుండును. కాళిదాసుని యభిజ్ఞాన శాకుంతలము, మే ఘసందేశము ననువదించి వెలువరించిరి. విక్రమోర్వశీయము, మాళవికాగ్ని మిత్రము కూడ దెనిగించిరని తెలియ వచ్చును గాని యచ్చుపడలేదు.

కాళిదాసుని ప్రతికృతికి నెన్నో పరివర్తనములున్నవి. అందులో నభిజ్ఞాన శాకుంతలమునకు మన తెలుగులో బేరుపడిన యనువాదములు పదిపదు నైదుదాక నున్నవి. శ్రీ పరవస్తు రంగాచార్యులుగారు [వీరిది రెండంకములు మాత్రమే 'సకలవిద్యాభి వర్ధనీపత్రిక' లో వెలువరింపబడినది], కందుకూరి వీరేశలింగము గారు, వేదము వేంకటరాయశాస్త్రి గారు, రాయదుర్గము నరసయ్య శాస్త్రిగారు, దాసు శ్రీ రామకవిగారు, వడ్డాది సుబ్బారాయుడుగారు, నిడమర్తి జలదుర్గా ప్రసాదరాయడుగారు, మంత్రిప్రెగడ భుజంగరావుగారు, కాంచనపల్లి కనకమ్మగారు, పేరి కాశీనాథశాస్త్రిగారు, వీరెల్లరును శాకుంతలాపరివర్తనకర్తలు. తరువాత మనకవిరాజుగా రొకరు. వీరితెలుగుసేతలో విశేషములు రెండున్నవి. కేవలము మూజానుసారముగ ముక్కకుముక్క తెలిగింపక