పుట:AndhraRachaitaluVol1.djvu/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వత్సవాయి వేంకట నీలాద్రిరాజు

1881 - 1939

క్షత్రియుడు. వసిష్ఠగోత్రుడు. తండ్రి: వేంకట సీతారామరాజు. జన్మస్థానము: మోడేకుఱ్ఱు. నివాసము: తుని. జననము: 1881. నిర్యాణము: 1939 సం. కృతులు: ౧.ఆంధ్రక్షత్రియులు (విమర్శనాత్మకము. 1920 ముద్రి.) ౨. ఆంధ్రమేఘసందేశము (1912 ముద్రి) ౩. అభిజ్ఞాన శాకుంతలము (1933 ముద్రి) ౪. విక్రమోర్వశీయము. ౫. మాళవికాగ్ని మిత్రము (ఆముద్రితములు).

ఈ నీలాద్రిరాజుగారికి దేశములో గవిరా జని ప్రసిద్ధ వ్యవహారము. ఈయన తిని సంస్థాన విద్వత్కవి. రాజులలో గవి యగుటయు గాక, కవులలో రాజగుటయు నీయనకు గవిరాజబిరుదము చరితార్థ మయినది. ఈ పద్యము వీరి వంశాది విశిష్టతను విస్పష్టపఱుచును.

సీ. రాజకేసరివర్మ రాజేంద్రచోళాది

జనపతుల్ కూటస్థ జనులు మీకు

భూలోక వైకుంఠాకవులు రంగ వేంకటే

శ్వరు లన్వవాయదైవములు మీకు

తెలుగురాయనరేంద్ర తిమ్మరాయన జగ

త్పతు లన్వయప్రదీపకులు మీకు

భగవత్పద ధ్యాన పర విశిష్టాద్వైత

మత మన్వయక్రమాగతము మీకు

గీ.ననికి వెనుకంజ వేయక యనుతృణములు

వదలి దివిచూఱకోలు సద్ర్వతము మీకు