పుట:AndhraRachaitaluVol1.djvu/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెట్లంటేని, "వినతసమ్మోదముద్రితాస్య, యగుచు వడ్డించెనమృతంబు" అని చెప్పబడుటచే దేశమున సంస్కరణముల తాత్కా కాంగీకారము, గరుడుని బంధవిముక్తిచే లోకమాన్యుని తదనంతర నిర్యాణమును, కాద్రవేయుల యాశాభంగముచే బ్రజల కిప్పటి ద్వంద్వపరిపాలనము వలని యల్పప్రయోజకత్వమును సూచితములు"

కవికి లోకజ్ఞత యుండవలసిన ముఖ్యలక్షణము. రాజకీయముగా దటస్థించు సంస్కృతి నెప్పటికప్పుడు గుర్తించుకొనుచుండెడి వేంకటరామయ్యగారి కడుపులోని "అమృతభాండము" కలమునుండి వెలి కుబుకుటలో నాశ్చర్యమేమి ? 'నాదారితోడు' అను కావ్యములో నంటరానివారిపై వీరు వెలిబుచ్చిన యనుకంపాభావము మఱచిపోరానిది.

క. వెలివాడ బుట్టినంతనె

వెలిబెట్టునె యీశు డతనిప్రేమకు బాత్రం

బులుగాని జంతు లిలలో

పల గలవే ? గాలిలేని బ్రదుకుంగలదే ?

క. ఒక యీశ్వరుకృప నందఱ

మొకయోడనెయెక్కి దాటి యొక నంద్రమునే

యొకతీరమె చేరగవలె

నిక నీసంశయములేల యిచ్చట మనకున్ ?

గీ. శాన సందేహపడక యోదోనెవాడ!

యెక్కని మ్మీమె నాతోడ నెక్కనిమ్ము

ఎక్కనిచ్చిన నీకేమి యెగ్గులేదు

తఱచిచూచిన నాకేమి తగ్గులేదు.

గీ. ధర్మజునిపోల్కి నేగాను ధార్మికుడను

అంటరానిదిగా దింతి యతని వేపి