పుట:AndhraRachaitaluVol1.djvu/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాయము. అట్టి బుద్ధచరిత్రము కృతినందు నదృష్టము మన వేంకటకృష్ణారావుగారికి బట్టినది.

సీ. ఎవని హూణాగమాతివిభూతి తెల్పు ద

త్ప్రాపకంబైన బి.ఏ పదంబు

ఎవని భాషాభిమాన విభవంబు వచించు

నెంచి చేయించు సత్కృతిచయంబు

ఎవని కవీంద్రగౌరవము చాటించు ము

ద్రాపిత ప్రాక్కవిగ్రంథపటలి

ఎవని యగణ్యపుణ్యవిశేష మెఱిగించు

నత్తకోడండ్ర యన్యోన్యమైత్రి

యతడు కొచ్చెర్లకోట వంశాంబురాశి

చంద్రు డురుకిర్తి సాంద్రుడు శాంతిపరుడు

రామచంద్ర వేంకట కృష్ణ రామచంద్రు

డనితరప్రతిభాశాలి యనియు దలచి.

అంకిత మిచ్చిరి గాని, సామాన్యుల కీ బుద్ధ చరితము కృతిగొనుటకు వీలులేనిది. ఈ కృత్యాది పద్యములు రెండిటివలనను దిరుపతి వేంకటకవుల కీ ప్రభువుపై గల గౌరవముతీరు విస్పష్టపడును.

చ. ఎవరికి నేని నిచ్చుపనియే మనవృత్తి యటంచు నెంచి స

త్కవులను బండితోత్తముల గాయకులం దనియించుగాని పో

లవరవిభుండు రక్షితకళావిదధీశుడు కృష్ణరావు మె

ప్పు వడయునంతపాటి బుధ పుంగవులుం గలరే జగంబునన్.

క. ఇత డతికవితాలోలుప

మతి యని వర్ణింపనేల మాటికి నీ సం