పుట:AndhraRachaitaluVol1.djvu/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకందుకూరి వీరేశలింగంపంతులుగారి సంస్కరణములు కొన్నిటిపై నీ ప్రభువునకు బరమప్రీతి. పంతులుగారు చెన్నపురిలో నెలకొలిపిన అనాథశరణాలయమునకు వీరు వేయిరూపాయలు విరాళమిచ్చిరి. 1895 లో నిలుపబడిన 'ఆంధ్రభాషోజ్జీవనీ' సంఘమునకు మన వేంకటకృష్ణారావుగా రుపాద్యక్షులు. ఇంక నీప్రభువు సాంఘికముగను, సారస్వతముగను జూచినచో దెలుగుదేశమునకు మంచి యుపకృతిగావించెను.

1898 లో నీకవిరాజు సంపాదకత్వమున 'సరస్వతి' తలసూపినది. ఆ పత్రికయే యీప్రభువునకు గల సారస్వతాభిమానమునకు గీటుఱాయి. తిరుపతివేంకటకవులు, వడ్డాది సుబ్బారాయకవి, కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు మున్నుగాగల యాధునికు లెందఱో సరస్వతి' నికృతిప్రసూనములచే నారాధించిరి. అదిగాక, శ్రీనాథునివి, అనంతభూపాలునివి, పినవీరభధ్రునివి, మారనవి, కందుకూరి రుద్రయ్యవి కృతు లీ 'సరస్వతి' ద్వారమున బ్రచుర ప్రచారము నందినవి. ఇటు లీ సరస్వతి యిరువదేండ్లదాక నడచినది. శ్రీకృష్ణారావుగారి 'సరస్వతి' కారణమున దెలుగు కవుల కెందఱకో యుత్సాహము పెరిగినది. దానితో సాహిత్య పత్రికల కఱవు తీరినది. పోలవరము జమిందారుగారు గొప్పరాజకవు లన్నపేరు నాలుగు ప్రాంతములందును మీఱినది. తిరుపతి వేంకటకవులను జేరదీసి యాస్థానకవులుగ నాదరించుచు వేంకటకృష్ణారావు గారు మఱింత ప్రఖ్యాతి నందిరి. విశేషించి, దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు మన కవిప్రభుని సరస్వతికి జేదోడువాదోడై యుండువారు. 'సరస్వతి' లో బ్రచురింపబడిన గ్రంథములన్నిటియందును శ్రీతిరుపతి శాస్త్రిగారి పరిష్కరణముద్ర పడినదనవచ్చును. 'సరస్వతి' ఘనతకు శ్రీ శాస్త్రిగారును హేతుభూతు లనుట యిప్పుడు మనము చెప్పవలసినమాట. తిరుపతి వేంకటకవుల గ్రంథములలో దేవీభాగవతము తరువాత బుద్ధచరిత్ర మొకటి బహుకాలము జీవించుగ్రంథమని విమర్శకుల యభి