పుట:AndhraRachaitaluVol1.djvu/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారు, కాళహస్తి సంస్థానపండితులు శతఘంటము వేంకటరంగ శాస్త్రిగారును వీరికి మిత్రులు. ఈకమ్మ యిందులకు దృష్టాంతము.


"సిరుల కిరవై, చదువులకు గుదురై, యీవికి దావలమై, దిట్ట తనమ్మునకు మనికిపట్టై, నీటునకు జోటై, ఓరుపునకు మేరయై, ప్రేముడికి గీమై, నాణెములకు దానకమై, పొంకంబులకు డెంకియై, చల్లదనంబుల కిలల్లై, మఱియు గొనమ్ముల కిమ్మై యిమ్మై గ్రాలుచు గతంబేదియు నాయెడం దద్దయు బోరామి గారాములు నెఱపుచు వఱలు నాయనుగు నెయ్యునకు-శతఘంటము వేంకటరంగయ్య గారికి-"


నాగపూడి కుప్పుస్వామయ్య బి.ఏ.


పై నుదాహరింపబడిన యిరువురుశాస్త్రులవలనను నీయన తన సాహిత్యమునకు మెఱుగులు పెట్టుకొనెను. అసలు కుప్పుస్వామయ్యగారు 1918 దాక న్యాయవాదులై పేరు సంపాదించిరి. కాని వారి కావృత్తిపై మనసులేదు. నిరంతరము భాషావ్యాసంగమే బిహారరంగము. తిరుపతి సంస్కృతకళాశాలకు నాడు వీరు విచారణకర్తలుగ నుండిరి.


ఈ విమర్శకుని జీవిత మానందతుందిలమైనది. శిష్టానుష్టాన పరులు. శాంతహృదయులు. తెలుగన్నచో నెన్నరాని యభిమానము. వీరి కుటుంబములోని వారందఱు భారత భాగవతాదుల పారాయణముతో గాలవ్యయము సేయుచుండువారట. కుప్పుస్వామయ్యగారి భారతసారము, భోజరాజీయము నను వచన గ్రంధములు మధురశయ్యా బంధములు."కవులకుగద్యము గీటురాయి" యని దండి పండితుని యాభాణకము. దానికి దగినట్లుగా నీయన వచనధోరణి మంచియొడుపు బెడగులలో నుండెడిది. చిన్నయసూరివలె నీయనయుజక్కని వచనరచయితయని నాడు వశంసించిరి. వ్యావహారిక వాద మీయన యామోదింప