పుట:AndhraRachaitaluVol1.djvu/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగపూడి కుప్పుస్వామయ్య

1865 - 1951

సామశాఖీయద్రావిడ బ్రాహ్మణులు. చిత్తూరు మండలములోని "చిరుతని" దరినున్న నాగపూడి వీరి నివాసము. తండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. జననము: 1865. నిర్యాణము: 1941. కృతులు: 1. భారతసారము 2. భోజరాజీయము 3. కాళహస్తీశ్వర శతకము 4. స్తవరత్నావళి (సంస్కృతము) 5. పారిజాతాపహరణ పరిమళోల్లాసము 6. భాగవవ, నిర్వచనోత్తర రామయణాది ప్రాచీన గ్రంథముల పీఠికలు.

కుప్పుస్వామయ్యగారు విమర్శ కాగ్రేసరులు. మదరాసులోని ఆనంద ముద్రాక్షరశాలాధికారులు వీరిచే గొప్ప సారస్వతసేవ చేయించిరి. వారుప్రకటించిన బాగవతము, కంకంటి పావరాజకృతోత్తర రామాయణము, నిర్వచనోత్తర రామాయణము మున్నగు ప్రాక్తన గ్రంధములను బాఠభేదములతో సరిచూచి ససిచేసి చక్కని పీఠికలు వ్రాసిన మహాశయులు వీరే. ఆంగ్లపద్ధతుల ననుసరించి యాంధ్ర గ్రంధముల కుపోద్ఘాతములు రచించినవారిలో కుప్పు స్వామయ్యగారిది యగ్రతాంబూలము. వీరి కావ్య-పురాణభూమికలు తరువాతవారి కొరవడిదిద్దె ననుటలో నత్యుక్తిలేదు. వీరి పాండిత్య-విమర్శకతా శక్తులను వేదము వేంకటరాయశాస్త్రి, కొక్కొండవేంకటరత్న ప్రభృతు లుగ్గడించిరి. శ్రీపీఠికాపురాధీశ్వరులు వీరిని గౌరవించిరి.


కుప్పుస్వామయ్య చెన్నపురిక్రైస్తవ కళాశాలలో జదివి పట్ట భద్రులైరి. సంస్కృతాంధ్ర సాహిత్యము చాలవఱకు స్వయం సంపాదితము. నాడు తిరుపతి సంస్కృతకళాశాలాధ్యాపకులు వట్టివల్లి నరకంఠీరవ