పుట:AndhraRachaitaluVol1.djvu/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెఱుగు గుండలముల మిసమిసల్ గండభా

గములపై నిట్టిట్టు గంతులిడగ

రంగారుకటినుండి బంగారుపుట్టంబు

చిఱుబొజ్జనుండి కొంచెముగజాఱ

బవనపూరణమున జవుజవ్వుమని లేత

బుగ్గలు బూరెలై పూరటిల్ల

నిగనిగల్ గల గుజ్జుసిగ నున్న శిఖిపింఛ

మొయ్యారమున దలయూపు చుండ

నుత్తమోత్తమజన్మమై యొప్పుమురళి

నధరమున మోసి జలుజల్లుమనగ జగతి

గానమును జేయుకకల్యాణకాంతు లొలుకు

నీదువదనంబు జూపింపు నీరజాక్ష!


ఈపద్యమున గవికి వేణుగానలోలుని విశ్వరూప మగపట్టినది. ఈ నాటకకర్తకు గోపాలబాలుని మురళీరవముపై నభిమానము. ఒక్కచో రాధకృష్ణు నిట్లు ప్రార్థించినది.


సరససంగీత మాధురీ సాధురీతి

నింక నొకసారి మురళి వాయింపుమయ్య

త్వన్ముఖామృతపూరంబు ద్రావుదాన

ఘనఘనాంబువు చాతక కాంతవోలె.


సుమధురము సుప్రసన్నము నగుభాషలో నాటకపద్యములు వ్రాయునేర్పు పానుగంటి లక్ష్మీనరసింహరాయనికే చెల్లినది. తరువాత చిలకమర్తి లక్ష్మీనరసింహరాయనికే తగినది. అన్యులు కాశైలి యసహజము. వీరి నాటకములలోని సంభాషణములు సన్ని వేశములు చాల సరసముగ నుండును. ఒక్కొక్కవిషయముద్రేకముతో రచింతురు. అట్టి సందర్భములయందు కొంత విరసముగనుండుటయు దటస్థించును. పానుగంటి కవి సీసములు విశేషించి గీతములువ్రాయు చుండును. ఆగీతములు వచనమువలె నడచుట వీరి కభిమతము. ప్రతిపద్యమున నుపమాన ముండి