పుట:AndhraRachaitaluVol1.djvu/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరికి బాశ్చాత్య వాజ్మయమున గూలంకషమైన ప్రజ్ఞ. పంతులుగారు, భాషలోనేగాక వ్యవహారమున గూడ దిట్టమైనప్రజ్ఞకలవారు. కొంతకాలము 'అనెగొంది' యాస్థానమున, గొన్నినాళ్లు ఉర్లాము ప్రభుత్వమున, గొంతకాలము లక్ష్మినరసాపురము సంస్థానమున మంత్రిగా పనిచేసిరి. తరువాత బీఠికాపురసంస్థానప్రభువులు వీరి వై దుష్యమున కానందించి చివరివఱకు నెలకు 116 రూప్యముల నిచ్చుచు సన్మానించిరి. పాశ్చాత్యభాషాప్రవీణులయ్యు నాంధ్రభాషాసేవ యమూల్యముగా నొనరించి తరించిన పండితు లీయన. అనుకరణము లీయన యామోదింపలేదు. అనువాదములు గావింపలేదు. 'ఆంధ్రి' ని మఱవలేదు. వీరు తీసికొనిన గాథలు పౌరాణికములు. కావ్యచిత్రణములు మాత్రము నవీనములు. వ్యాసములలోనేకాదు నాటకములలోనే కాదు హాస్యమునకు బ్రాధాన్యము. సాక్షిలోని వ్యాసములకు హాస్యరస మతిమాత్రమైనను బ్రమాదములేదు. కాని వీరి కొన్ని నాటకములలోని హాస్యము ప్రధానరసతిరోధానము చేయుచు నత్యధికమైనది.


శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి నాటకములలోని పద్యములు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చినది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్‌స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చినది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది.