పుట:AndhraRachaitaluVol1.djvu/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిందె బిందెడు కాఫీకి పిడుగు తునక కట్టచుట్టల కాల్చెడి పుట్టుభోగి బుట్టెడాకులు నమలెడి పుణ్య భోగి నాగరికు లన్న వేఱె యున్నారె, వీరె.

"బహిస్సర్వాకార ప్రవణరమణీయం వ్యవహరన్" అను భవభూతి శ్లోకమున కీకవియాంధ్రీకరణపుమచ్చు నిచ్చినచో వీరిశక్తి తెలియగలదు.

మన సెటులుండనీ పయికి మాటల జేతలచేత లోక రం జన మొనరింపుచున్ దనరు స్వల్పపుదోషములైన దాచుచున్ జనులను మోసపుచ్చి యొరుచాడ్పున నేర్పరి తా దటస్థుడై తనపనిచక్క బెట్టుకొను దాల్చును బిమ్మట మౌనముద్రయున్.


                            ___________