పట్టిన దెల్ల బై డియగుభంగిని పల్కినపల్కు పద్యమై యుట్టిపడంగ జెప్పినదె యొప్పిన వేదము కాగ సత్కధల్ కొట్టినపిండిగా గవితగూర్చిన ధన్యుల లోకమాన్యులన్ బుట్టను దిప్పనుం బొడమి పూజ్యతగాంచినవారి నెన్నెదన్. "సుధానిధి"
ఆట వెలదు లున్న తేటగీతములున్న మనసు కరగిపోవు మంచుపగిది ఆట లేక తేటపాటయు లేకున్న వెలదు లున్న జాలు నేవరాలు "ఆటవెలదులు తేటగీతములు"
సీ. నెలతలు చంటి బిడ్డలకు బాల్గుడుపుటే ప్రకృతిధర్మంబని పలుక రాదు ప్రకృతశాస్త్రజ్ఞలౌ పండితుల్ డార్విను మున్నగువారలు కొన్ని చోట్ల పురుషులు రొమ్మినం బొడమినపాలతో శిశుపోషణం బని చెప్పినారు ప్రకృతి ధర్మంబులు ప్రభవించు నశియించు నభ్యాస పద్ధతి ననుసరించు
మగువల కెగాని చన్బాలు మగల కెందు పొడమ వనుమాటలన్నియు బూటకములు పురుషు లిక మీద స్తన్యంబు వొడమునట్లు రొమ్ము సవరించుకొనుట కార్యమ్ముకాదె ? "సంఘసంస్కరణము"