పుట:AndhraRachaitaluVol1.djvu/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలభ్యములు. ఆంగ్లభాషాకృషి సేయనెంచి 'మిడిల్ స్కూలు' పరీక్షకు బోయి రాజధానిలో బ్రథములుగా నెగ్గిరి. తరువాత న్యాయవాది పరీక్షకు జదివి యుత్తీర్ణులై పార్వతీపురము మునసబుకోర్టున బనిచేసిరి. లౌకికోద్యోగము చేయు చున్నను సాహిత్యవ్యవసాయము వీడక గ్రంథరచనము చేయుచు 1892 లో 'ఆంధ్రపద్యావళి' యనుపేర దమఖండ రచనల నొక సంపుటముగా వెలువరించిరి. తరువాత 'రహస్యదర్పణము' ముద్రించిరి. అం దదృశ్య ప్రపంచరహస్యములు, క్రిమికీటక పక్షి జంతు యాత్రాదిరహస్యములు మొదలగువానిపై నపూర్వపరిశోధనము కలదు. విక్రమోర్వశీయము, ఉత్తరరామచరిత్రము బాసలోనికి బరివర్తించిరి. వీని కంతప్రశస్తి రాలేదు. 1903 లో 'కల్పలత' యను విజ్ఞానవిషయక మాసపత్రిక నెలకొల్పిరి. ఆ కల్పలత రెండేండ్లలో యశోలతయై యాగిపోయినది. మరల 1919 లో దాని లేవదీసి కొంతకాలము నడపిరి.

శర్మగారు తెలుగున జరిగిన యెన్నో మహాసభలకు ఆధిపత్యము వహించిరి. 1923 లో గుంటూరుమండలమునందలి 'నండూరు' న జరిగిన యాఱవ యాంధ్రసారస్వతసభకు వీరధిపతులు. ఆపరిషత్తుననే వీరిని మహోపాధ్యాయ బిరుదమున సత్కరించిరి. 1924 లో ఆంధ్రసాహిత్యపరిషత్త్రయోదశ వార్షికోత్సవమునకు వీరు సభాపతులు. 1929 లో దెనాలియందు జరిగిన ప్రథమాంధ్రనాటక కళాపరిషత్తునకు శర్మగారాధ్యక్ష్యము సభ్యప్రార్థనపై నంగీకరించి యద్భుతముగా సభ్నునిర్వహించిరి.

ఈవిధముగా మహాసభల కధ్యక్షుడై, మహోపన్యాసకుడై మహోపాధ్యాయు డనిపించుకొనిన సాంఖ్యాయన శర్మగారి కవితా విశేషము లిక జవిచూతము. ఈయన కవిత రసస్ఫోరకము. సరళపద భరితము.