పుట:AndhraRachaitaluVol1.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాధవము, మహావీరచరితము, మాళవికాగ్ని మిత్రము మొదలగు నాటకము లెన్నియో యాంధ్రీకరించి ఘనత గాంచిరి.

వీరి కావ్యప్రపంచమున జిరస్థాయిగా నుండునది దేవీభాగవతము. రసవిలసితముగా నున్నది "తెలుగునాడు". ఇది స్వతంత్రపు గబ్బము. ఇందలి పద్యములు స్వభావసిద్ధములు. మందునకు కొన్ని పొందుపఱుతును.

ముదికరణాలు రాముగుడిమోసల రచ్చలుదీర్చి, భారతాల్ చదువుచు, లోకవార్తల ప్రశంసల నండ్రు: తెలుగుబాస మం చిది, మన పిల్లకాయలు వచించెడి యింగిలిపీసు పుంపునన్ బెదవులు దాట దెంతటి 'ఎఫేయు' 'బియే' 'ఎమియే' వచించినన్. లేవరు 'లెండు లెం" డనిన లేచినవారయినం దటాలునం బోవరు పోవుచున్ని లిచిపోదుము త్రోయకుండటం చీవరు సందు గేస్తునలయింతురు పెండిలిలో నదన్య సం భావనవేళ జూడవలె బావనసాముల సాములన్నియున్. నమ్మిన నమ్మకున్న నది నావశమా? జను లాడికొన్న వా క్యమ్మును నేను జెప్పిదభయంపడియో పడకో, నియోగిలో క మ్మనివార్య కార్యఘటక మ్మవుగాని పరోపకార శూ న్యమ్మును స్వప్రయోజన పరాయణముం దలపోయ నిద్ధరన్. చెళ్ళపిళ్ళ కవి వ్రాసినట్టు లిక్కవికవిత జనరంజకము, లోకానుభవ వ్యంజకము నై యున్నది. అస్సే చూస్సివషే వొషే చెవుడషే అష్లాగషే యేమిషే నిస్సా వజ్ఘలవారి బుఱ్ఱినష ఆవిస్సాయి కిస్సారుషే.