పుట:AndhraRachaitaluVol1.djvu/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాసు శ్రీరామకవి

1864 - 1908

ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. హరితసగోత్రోద్భవుడు. తండ్రి: కన్నయమంత్రి. తల్లి: కామాంబ. జననము 1864. నిధనము 1908. పుట్టుక: కృష్ణామండలములోని కూరాడలో. మృతి: గోదావరీ మండలములోని ఉప్పు ఏలూరులో. ఈతని ప్రత్యేక గ్రంథములు 34. 1. ఆచార నిరుక్తి 2. దురాశాపిశాచభంజిని 3. వైశ్యధర్మదీపిక 4. ఆంధ్రవీధి 5. అభినయదర్పణము 6. కృతులు 7. స్వరజితులు 8. పదములు 9. జానకీపరిణయ నాటకము 10 మనోలక్ష్మివిలాస నాటకము 11. అచ్చతెలుగు అభిజ్ఞాన శాకుంతలము 12. రత్నావళి. 13. మాలతీ మాధవము 14. మాళవికాగ్నిమిత్రము 15. ముద్రారాక్షసము 16. ఉత్తరతామచరితము 17. మహావీరచరితము 18. కురంగగౌరీ శంకరము 19. మంజరీమధుకరీయము 20. సంగీతరసతరంగిణి యను బుద్ధనాటకము 21. తర్కకౌముది 22. అభినవగద్య ప్రబంధము 23. సాత్రాజితీ విలాసము 24. లక్షణా విలాసము 25. ఆంధ్ర దేవీ భాగవతము 26. తెలుగునాడు 27. సూర్యశతకము. 28. భృంగరాజ మహిమ. 29. సంగీతరసతరంగిణి మున్నగునవి.

దేవీభాగవతము పదునెనిమిదివేల గ్రంథము. దాని నయిదునెలలో గద్యపద్యాత్మకముగా నాంధ్రీకరించి యాఱవనెలలో నచ్చున కిచ్చిన యాశుకవిసింహులు దాసు శ్రీరాములుగారు. ఆశుకవితయైనను నంద మెచ్చటను గొఱవడలేదు. దేవీభాగవతమును మెట్టమొదట దెలిగించిన కవి ములుగు పాపయారాధ్యుడు. దేవీభాగవతమును మొట్టమొదట బ్రచురించినకవి దాసు శ్రీరాములుగారు. తిరుపతి వేంకటకవు