పుట:AndhraRachaitaluVol1.djvu/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"భరతా దరతా సరతా ! విరతా మరతాపహరణ విమలహృదయ, కుందరదా దరదా వరదా ! శరదా శరదాభ శ్రీవిజయగోపాలా' యని చదివితి. అర్థమేదీ యనగానే మీముఖత: వినుటకు జుడీ యంటి, 'ఇదే మనవారివెఱ్ఱి. ఇంత క్లిష్టముగా జెప్పుట యెందుకో యనిరి. వెఱ్ఱియేమి? వివేకమే. కవిసమర్థత యిట్టివాని వలననేగదా తెలియునది యంటి. ఆయన మరల నర్థము మాట యెత్తక చాచివైచి ప్రబంధముల ధోరణిలోనికి దింపిరి. ప్రొద్దు పోవుటచే మేము వెడలి వచ్చితిమి."

ఈకవి మొత్తము చిన్నవి, పెద్దవి కలసి డెబ్బదియొక్క కృతి రచించెను. వీనిలో గొన్ని పాఠశాలాపాఠ్యములుగా నెన్నుకొనబడినవి. నాలుగైదుతక్క దక్కినవెల్ల నచ్చుపడినవి. ఏగ్రంథమునకు బెద్ద ప్రఖ్యాతి వచ్చినటులు లేదు. కవిత నిర్దుష్టముగానుండి ధారళముగ నడచును. అంతకుదప్ప రసపాసముల యందము వారికవితలో దక్కువ. కవి వైష్ఠికుడు, భక్తుడుగాన భగవత్పరములైన దండకములు, శతకములు పెక్కులు వ్రాసెను. ఒక్కటియు గక్కూరితిపడి నరాంకితములు సేయలేదు. దైన్యముతో నన్యుల నచ్చుకొఱకై యాచింపలేదు. అది యీకవిలోగల విశిష్టగుణము. వీరాంధ్రీకరించిన దండియనామ స్తవములో రెండు పద్దెములివి.

ఉ. పంచశరుండు కొంచకెద బచ్చన వింట విమోహనాస్త్ర మ

త్తెంచి యహంకరించి వెనుదీయక యేయగ బంచవక్త్ర! రో