Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదువయినవెంటనే 1880 సం. మొదలు నర్సాపురము, కిర్లంపూడి, రాజమండ్రి, పెద్దాపురము ఆంగ్లపాఠశాలలో నుపాధ్యాయపదవి నిర్వహించిరి. 1894 లో నారంభించి 1929 దాక కాకినాడ పిఠాపురంరాజావారి కళాశాలలో నధ్యాపకత సాగించి, యెందఱనో శిష్యులను ముందునకు దీసికొనివచ్చిరి. సర్వారాయకవిగారు చాలమమదికి బద్యములు దిద్దిపెట్టినట్టుగ వారిచరిత్రయు దెలుపుచున్నది. తచ్ఛిష్యులను జెప్పుచున్నారు. ఆయనిదట్టి యుపకారిబుద్ధి.


శృంగాకవిత వ్రాయుటలో వీరికి మంచిప్రవేశము కలదు. చమత్కృతిమై భాషించుట యందును వీరు నేర్పరులు. ఈవిషయములకు వీరి 'స్వచారిత్రము' లోని కొన్ని మాటలు తీసి వ్రాసెదను.


"ఒకప్పుడు ముత్తుస్వామిశాస్త్రిగారితో వీరేశలింగముగారింటికింబోవ దటస్థించినది. ఆయన నన్ను గూర్చుండుమనలేదు. ఎవరువీ రనియడుగలేదు. ముత్తుస్వామిగారే వీరు మాస్కూలుపండితులుసుమండీ! యని ముచ్చటించిరి. అప్పుడు మీయింటిపే రెవరనిరి. శృంగారకవి వారంటిని. మీపూర్వులు శృంగారకవిత్వము చెప్పువారు కాబోలునేయనిరి. పూర్వమే కా దిప్పుడును జెప్పుట కలదంటి. ఏమి చెప్పితి రనిరి. లక్షణా పరిణయము, ముకుందశతకము. శివానందలహరి, మహిమ్నము మున్నగున వని చెప్పితి. మీపూర్వులేమి చెప్పిరనగా బెక్కులున్నవి యని పలికితిని. ఏది యొకపద్య మనిరి. "వరమా సురమా విరమా భరమా పరమాన్య నన్ను బటుదయ బ్రోవన్ 'సురమానినీ సుతవిలాసరమా పరమాత్మ శ్రీవిజయగోపాలా'" యని చదువ నర్థము చెప్పుమనగా జెప్పితి. కాని తొలుదొల్త గౌరవింపకుండుట, పదపడి పిల్లవానివలె నర్థము చెప్పు మనుట నాకు గష్టమై వెంటనే