పుట:AndhraRachaitaluVol1.djvu/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హూణ సంవత్సరమున కనూన భక్తి
నీకునర్పించితిని జుమి నీరజాక్ష !
                                               'స్వచారిత్రము' నుండి.

ఆత్మస్తుతి యగుననియో, యన్యు లేమనుకుందురో యనియో మనపూర్వు లేరును స్వీయచరిత్రములు వ్రాసికొనినవారు కారు. ఆంగ్లేయులను జూచి మొట్టమొదట మన కందుకూరి వీరేశలింగము పంతులుగారీత్రోవం దీసిరి. అదియాదిగా దెనుగులో రచయిత లెందఱో శ్వీచారిత్రములు పొందుపఱుచుకొను నలవాటు చేసికొనిరి. చిలకమర్తి లక్ష్మీనరసింహముగారి "స్వీయచరిత్రము" ప్రకటితమైనది.ఇట్టి వింకను జాలమంది రచనలు ప్రచురితములు కాని వున్నవి. శృంగారకవి సర్వారాయకవి సంధానించుకొనిన "స్వచారిత్రము" వారియనంతరము, చక్కగ నచ్చులోనికి వచ్చినది. కవి తాను దన యనుభ వాదికము వ్రాసియుంచుకొనుట, యతని తరువాత నదియెవరో బయట బెట్టి ముద్రించుట యనునది చక్కనిమార్గము. దానంజేసి, తత్కవి యాత్మస్తుతి చేసికొన్న వాడుగాదోపడు. మన సర్వారాయకవిగారి స్వచారిత్రము బహుపవిత్రమైనది. అందాత్మస్తుతిగాని, అన్యనిందగాని, అసత్యముగాని, అక్కఱలేనిదికాని యొకా యక్కరము లేదు. ఏదో జ్ఞాపకార్థము దైనందినచర్య వ్రాసికొనినటులుండెను. ఆచారిత్ర గ్రంథమే యిపుడు నాకాధారపడినది.

శృంగారకవి యనునది పౌరుషనామము విస్సాప్రగడగారు క్రమముగ నిటులైరి. వీరిపూర్వులలో వెంకయ్యగారనబడు నొకరు శృంగార పద్యములు నాలుగు రచించి తాటియాకుపై లిఖించి తమగ్రామమునకు వచ్చిన యొకమహమ్మదీయాధికారి దగ్గరకు వెళ్ళి చదివిరట. ఆయన యానందపడి "శృంగారకవివర్యా" యని ప్రశంసించి పందుము మెఱక-----ఒకగుఱ్ఱము నిచ్చి సత్కరించెనట. నాడుమొదలు పలువురును వీరిని శృంగారకవివా రనుచుండిరట

............... ................. ..................

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)