పుట:AndhraRachaitaluVol1.djvu/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిలుకడం దగ కాడును నీటిపాప

మదిని బాపగ జేయకు మల్లినాథ!


ఈపద్యములు మల్లికార్జున శతకములోనివి. చంపకమాలిక కడుపులో కంద - గీతములు రెండును నిమిడియున్నవి. జాగరూకతతో నీ మూడుపద్యములు చూచినచో గవిగా రెంత పరిశ్రమించిరో వెల్లడి కాగలదు. సాధారణముగా బంధకవితలు రచన రామణీయకము కొఱవడి యుండును. పురుషోత్తమకవిగారి శైలిమాత్రము మధురధారకలది-బంధకవిత్వములో నీయన యందెవేసినవా రనుట కెన్నో కృతులు తారకాణ లున్నవి. అది యటుండె; వీరి యద్భుతోత్తరరామాయణము నందలి వివధవర్ణనాంశములు గల పద్యములు కొన్ని:


క. అసలది వసంత మాయెను

బసరంగు సరింప విడిచె బడ జల్లిన య

ట్ల సదా యలరారుగదా

మిసమిస నదృశము లయ్యె మేదిని దరుపుల్.


క.వట ఫలము చుబుక మపునవి

నటు పటు దంతములు దాడిమాంచిత బీజో

త్కటములు మౌక్తికకుంద

స్ఫుటములు విశ్శ్రేణిబోల్ప బొలుపగువళులన్.


క. మదగజముల గేరెడినో

కుదిరిక యంచరులకు గూర్పగోరెడి నోయా

పదముల యెదుగుడు గమనిక

కుదిరెడి నే నాగకవులకు స్వర్ణింపన్.

నీసంవిధముగా మనోహరరీతిని చతుర్విధకవితలు సంతరించిన సుకవి పురుషోత్తములు కుమారరత్నము నాదెళ్ళ మేధా దక్షిణామూర్తి శాస్త్రిగారు తెలుగు రచయితల నెఱగినవారు.

                          ____________