Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషోత్తమకవి యిపుడు తెలుగువాడై, "బుధవిధేయిని" యను పత్రిక సంపాదించుట కారంభించెను. ఆయన తెలుగు పత్రికా సంపాదకుడైనను భారతీయుడు. తనపత్రికలో "నేషనల్ కాంగ్రెసు" ను గూర్చి ప్రచారవ్యాసములు వ్రాసి ప్రకటించెను. కాంగ్రెసుపై ఉరుదుభాషలో మహ్మదీయుల కుపన్యసించిచెప్పిన ప్రబోధకులు పురుషోత్తమ కవిగారు. కవికి జాతీయభావములు నిండార నుండవలయునుగదా!


పదవడి, వీరు 1887 మొదలు 1908 దాక హిందూబ్రాంచి స్కూలు హెడ్మాష్టరుగా శిష్యులను దిద్దెను, ఈ యుద్యోగము లన్నియు బురుషోత్తమున కార్థికములు. హార్దికముగా వీరునిర్వహించుచున్నది సారస్వతోద్యోగము. వీరు హెచ్చుగా బంధగర్భ కవిత్వాభిమానులు. చతుర్ముఖి కందపద్య రామాయణము, చిత్రకంద పద్యరత్నాకరము, మల్లికార్జున మకుటాంచ త్కందగీత గర్భితోత్సల చంపక మాలాష్టోత్తర శతకము ఇత్యాదులందుల కుదాహరణములు. చతుర్విధ కవితా ధురంధరులని వీరికి గల బిరుదము. పురుషోత్తమకవి శతక కవితా ధోరణి యీతీరు గలయది:


చ. ఒగి నగుమోముతో ముదమునొందగ జేయును ముద్దుపాప తా

వగనగ నెట్టులే గనెడువారి నడంబడు గంటి పాప చూ

డగ దిగువ స్వడి న్నిలుకడం దగ కాడును నీటిపాప తా

బగ లెగురుంగదా మదిని బాపగ జేయకు మల్లికేశ్వరా!


క. నగు మోముతో ముదము నొం

దగ జేయును ముద్దుపాప తా వగ నగనే

దిగువ వ్వడి న్నిలుకడం

దగ కాడును నీటిపాప తాబగ లెగురున్.


గీ. ముదము నొందగ జేయును ముద్దుపాప

కనెదు వారి నడంబడు గంటిపాప