పుట:AndhraRachaitaluVol1.djvu/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాంద్రమున బద్యకవిత్వము చేయుటకు వీలుపడదు. అటులే, చిన్నయసూరికి బూర్వము గద్యగ్రంధములు రచించినారు. లేదనుటకు ధైర్యము చాలదు. కాని 'నీతిచంద్రిక ' వంటి యుత్తమ వచన శైలి యనన్య లభ్యమైన వైలక్షణ్యము గలిగియే యున్నది. కావున బద్యమున నన్నయకువలె గద్యమును జిన్నయకు నాద్యస్థానము నీయలెను.

చిన్నయసూరి తండ్రి వేంకటరంగయ్యగారు మంచి పండితులు. వీరు చెన్నపురిలో ఈస్టుఇండియాకంపెనీలో పాలనముననున్న యున్నత యున్నత న్యాయస్థానమునగల పండితుసభ్యులలో నొకరు. 1836 లో వీరు మరణించిరి. చనిపోవునప్పటికి వీరి వయస్సు నూటపదియేండ్లవరకునుండును.సూరి తండ్రికడనే తెనుగు, అరవము, సంసృతప్రాకృతములు చదువుకొనెను. కంచి రామానుజాచార్యులతో దర్కాలంకార మీమాంసలుఠించెను, ఉత్తరదేశ పండితుడు రామశాస్త్రి యనునాయనకడ వేదవేదార్ధరహస్యములు సంగ్రహించెను. ఈ రామశాస్త్రియే సూరికి హయగ్రీవమంత్రోపదేశ మొనరించెను. సూరి స్యయంకృషిచే నాంగ్లముతోగూడ నించుగపరిచయము కలిగించుకొనెను. వేదము వేంకటరమణ శాస్త్రులుగారు (వేదము వేంకటరాయ శాస్త్రి గారి తండ్రి) చిన్నయసూరినాటివారు. వీరువుదు సాహిత్యగోష్టి చేసెడువారు. సూరిగారి యాంగ్లభాషాపరిచయము బ్రౌనుదొర మున్నగువారితో విశేషస్నేహము చేకూర్చినది. ఉన్నతోద్యోగులగు నాంగ్లేయులెందఱో సూరిగురుత్వమున సంసృతాంధ్రములు సాధించిరి. వారివారి సాహాయ్యమున పచ్చయప్పకళాశాలలో సూరి ప్రధాన పెండితపదము సంపారించి 1845 మొదలు 1848 వఱకు నచట నుద్యోగించెను.