పుట:AndhraRachaitaluVol1.djvu/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పరవస్తు చిన్నయసూరి

1806 - 1862

సాతాని శ్రీవైష్ణవుడు. అభిజనము: చెంగల్పట్టు జిల్లాలోని పెరంబూదూరు. ఉనికి: చెన్నపురము. తల్లి: శ్రీనివాసాంబ. తండ్రి: వేంకటరంగయ్య. సూరి జననము: 1806 - నిర్యాణము: 1862. రచించిన గ్రంథములు: చింతామణివృత్తి 1840- పద్యాంధ్రవ్యాకరణము 1840- సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము 1844- పచ్చయప్ప నృపయశోమండనము 1845- ఆదిపర్వవచనము 1847- శబ్దలక్షణ సంగ్రహము 1853- నీతిచంద్రిక 1853- నీతిసంగ్రహము 1855- బాలవ్యాకరణము 1855- విభక్తి బోధిని 1859- ఆంధ్రధాతుమాల- అక్షరగుచ్ఛము- ఆంధ్రశబ్ద శాసనము- బాలవ్యాకరణ శేషము- ఇంగ్లీషులా చట్టముల భాషాంతరీకరణము- ఆంధ్రకౌముది (వచనము)- ఆంధ్రకాదంబరి (వచనము) అకారాది నిఘంటువు- చాటుపద్యములు- సుజనరంజనీ పత్రిక- యాదవాభ్యుదయము.


ప్రాచీనాంధ్ర భాషాయుగమునకు నన్నయవలె, అర్వాచీనాంధ్ర భాషాశకమునకు ' చిన్నయ ' మార్గదర్శకుడు. నన్నయ తననాటి వ్యావహారికమును గ్రాంథికవ్యాహారముగా సంస్కరించుటకు చింతామణి రచించిన శబ్దశాసనుడు. చిన్నయ దేశభాషలో బాలవ్యాకరణము రచించి యాంధ్రపాణిని యనిపించుకొనిన సూరి. చింతామణికి శేషగ్రంథముగా 'అథర్వణ కారికలు' బాలవ్యాకరణమునకు శేషగ్రంథముగా 'ప్రౌఢవ్యాకరణము' వెలువడినను విద్వాంసుల శాస్త్రార్థముల కాగినవి చింతామణి బాలవ్యాకరణములు రెండే. నన్నయభట్టు భారతామ్నాయము నాంధ్రీకరించి తెలుగున బద్యకవితకు బాటవేసెను. చిన్నయ సూరి నీతిచంద్రిక సంధానించి యాంధ్రమున గత్యకవితకు ఘంటాపథము కల్పించెను. ఆదికవి యనబడిన నన్నయభట్టారకునకు బూర్వ