Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వావిలికొలను సుబ్బారాయకవి

1863 - 1939

భారద్వాజగోత్రజులు. ఆపస్తంబసూత్రులు. గోల్కొండవేపారి. తల్లి: కనకాంబ. తండ్రి: రామచంద్రుడు. అభిజనము: కడప మోచము పేట. జననము: 1863. నిర్యాణము: 1939. విరచితకృతులు: శకుంతల చరిత్ర, సులభ వ్యాకరణము, సతీహితచర్య, ఆర్యకథానిధి (ఆరు భాగములు), నలచరిత్ర, గర్భిణి, హరిశ్చంద్రచరిత్ర, ఆంధ్ర వాల్మీకి రామాయణము, కుమారహితచర్య, కుమారాభ్యుదయము, కృష్ణ లీలామృతము, కౌసల్యాపరిణయము, ఏకశిలానగరద్వయవివాద సంగ్రహము, హనుమంతచరిత్రము, భవతారకలీల, బాలకహితచర్య, భగవద్గీత, కృష్ణావతారతత్త్వము - మున్నగునవి.

శ్రీ సుబ్బారావుగారు పండితకవులుగా బేరుసంపాదించిరి. భక్తాగ్రేసరులుగా గీర్తిగాంచిరి. లోకమున గొందఱకు బాండిత్యకవిత్వములు పురాకృత విశేషమువలన గలిగి యుండవచ్చును. అట్టివా రాపాండిత్య కవిత్వ ప్రకర్షమును దేశమున వెల్లడించుటకు రామాయణము రచింపవచ్చును. భాగవతము వ్రాయవచ్చును. అంతమాత్రమున నట్టికవులకు దైవభక్తి దైవ విశ్వాసము సంపూర్ణముగ నుండు ననుట పొసగదు.


అట్లుగాక, మన సుబ్బారావుగారి దైవభక్తి యవ్యాజసిద్ధమైనది. దైవభక్తియే వీరికి గవిత్వలక్షణము చెప్పినది. దైవభక్తియే యీయనకు బాండిత్యవంతు నొనరించినది. భాగవతరచయిత పోతనామాత్యుడే యిందులకు బ్రథమోదాహరణము. వీరిని మొదట భాగవతులని, ఎదన బండితులని, చివర గవులని చెప్పుట క్రమానుగుణము. సుబ్బారావుగారికి బోతన్నపై బెద్దయభిమాన మున్నది. నరకృతుల నీయక పోవుటలోను భగవద్భక్తి పారవశ్యములోను వీరిర్వురు సహపాఠులు. కవితారచనయందు మాత్రము వీరికి పెద్దయంతర మున్నది. భాస్కర రామాయణమునకు వెనుకను ముందును గూడ దెలుగులో నెన్నో