Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామాయణములు వెలువడినవి. కాని తెలుగుభాగవత మొక్క పోతనామాత్య రచనమే. ద్విపదభాగవత మొం డున్నదనినను నది ప్రచారములో లేదు. ఆధునికులలో నిదారుగురు యథావాల్మీకి రామాయణములు రచించినవారును, రచించుచున్నవారును, రచింప దలంపు గలవారును గలరు. భాగవతము దరి కెవ్వరును బోజూచుటలేదు. ఇది పోతనమహాకవిలోని విశేష మేమో ? ఆ కవివరునిపై మన సుబ్బారావుగారెట్టి యభిప్రాయము ప్రకటించిరో చూడుడు !


తుచ్ఛులు సరిగా దనినను
స్వఛ్ఛపు బోతన కవిత్వసంపద చెడునే
నేచ్ఛ జరచి దూషించిన
నచ్ఛపతివ్రతను బావ మంటుట యున్నే ?
                   ( శ్రీరామాయణ పీఠిక.)


వా. సు. దాసుగారి చేతిలో జాలమంది విషయరక్తులు పరమ భక్తులైరి. వీరు ' భక్తసంజీవని ' యను మాసపత్త్రిక కొన్ని వత్సరములు వెలువరించిరి. దైవ, భాషాసేవ లొకదాని నొకటి మించునట్లు గావించి ధన్యులైన సుబ్బారాయకవిగారు వాల్మీకి రామాయణము యథా మాతృకముగా నాంధ్రీకరించిరి. కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగా రొక రిట్లేవ్రాసిరి. వా. సు. దాసుగారి రామాయణకవితలో బ్రౌఢతకు లోపములేదు. వీరు రామాయణము నిర్విఘ్నముగా రచించి తరించిరి.


సీ. కనులకు గలకయు గరళంబు మదికినై
          తపియింప జేయు విత్తమ్ములేదు
కాళ్ల బందా లురిత్రాళ్లు కుత్తుకకునౌ
          బిడ్డల జంజాట మడ్డు లేదు
మంచిసెబ్బెర లెద స్మరియింపనీయని
          యంతటి భోగంబు లమరలేదు