పుట:AndhraRachaitaluVol1.djvu/190

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శా. కాణాదర్శివర ప్రణీతమగు తర్కం బేనెఱుంగంజుమీ

పాణిన్యారచితంబు వ్యాకరణ మొప్పం గొంచె మీక్షించితిన్

వాణీనైపుణి లేదు రాజసభలన్ వాదింప లేనమ్మ యే

వాణిజ్యంబును నేనెఱుంగ నికనంబా! లక్ష్మి!రక్షింపుమా.

కవి గర్వరాహిత్య మీపద్యములో బ్రస్ఫుట మగుచున్నది. కవి సత్యవాదియనుట కీపద్యమే గొప్ప యుదాహరణము. వాస్తవముగ, రంగశాయికవికి నోటిధాటి తక్కువ. ఏదో వ్రాసికొనుచు నజ్ఞాతముగ గాలయాపనముచేయువాడే గాని, రాజసభలకుబోయి ఝంకారముగ లేనిపోని బొంకులాడి విత్తసంపాదనముచేయు దారు లీయన యెఱుగడు. ఈకవివరుని సంస్కృత కవితాధోరణి మనోహరముగనున్నది. ఆభాషలో నీయన రచించినవి మూడు గ్రంథములు: 'నారాయణానందలహరి' లోనివి రెండు చూపెదను-

శ్లో. రసజ్ఞా స్మాకీనా మధురరసయుక్తానపి బహూన్

పదార్థన్నేచ్ఛంతీ తవరుచిరనామ్నో మధుర తాం

విదిత్వా త్వామేవ స్మరతిఖలు శశ్వద్గతరుచి

ర్భవంతం సంస్తోతుం ప్రతికల మియం కాంక్షతి హ రే!

శ్లో. యథావీణాగానం తవహిత మభూ న్నా రదమునే

ర్యథా ప్రహ్లాదోక్త స్తుతిఫణితి రాపాభ్యుపగమమ్!

యథా నమ్యక్ప్రీతి శ్శుకవచనరీతి స్సమభవత్

తదై వాస్మత్ర్పోక్తస్తుతిరపి మురారే భవతు తే:

రంగశాయికవి శతకములు, తెనిగింపులు తప్ప స్వతంత్రకావ్య మొక్కటియు రచింపలేదు. అటులు రచించు నుద్దేశము కూడ నాయనకు లేదని విన్నాను. "అసత్య వస్తువులను వర్ణించి, యభూత కల్పనములు చేసి స్వతంత్రకావ్యములు రచించుట నా సత్యవ్రతమునకు భంగము కలిగించును