పుట:AndhraRachaitaluVol1.djvu/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గాన మానివైచితి" నని సమాధానము చెప్పెడివాడట. నిజము; రంగశాయికవి మడికట్టుకొనిగాని కవిత్వము వ్రాయువాడు కాడు.

ఈయన పిఠాపురములో శ్రీ సూర్యరాయనిఘంటు కార్యస్థానమున నుద్యోగించిన నాళ్ళలో ద్రోవలో నేయంట రాని యాకో కాలికి దగిలినటు లనుమానము తట్టిన నింటికివెళ్ళి సచేలస్నానముచేసి కార్యాలయమునకు వచ్చెడివాడని వింటిని. 'ఆఫీసు' సమయమున కాలస్యమైనను, దనయాచారమునకు లోటులేకుండ బ్రవర్తించిన యమాయకు డీయన: రాజకీయతంత్రములు, లౌకికయంత్రములు, తెలియక, శుద్ధవైదిక సంప్రదాయమున, జీవయాత్ర గడపిన పవిత్రమూర్తి రంగశాయికవి. ఆయన 1836 రాగనే, తనచంపూభారతములో, తనశతకములలో దనజీవితము దాచుకొని మహాప్రస్తానము సాగించెను, "శుచిర్వప్ర శ్శుచి:కవి:."

                           ________