పుట:AndhraRachaitaluVol1.djvu/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కోబడిన కర్మిష్ఠి. ఈయన సత్యవరతగొప్పది. ఈయన జయపురము, నూజవీడు మున్నగు సంస్థానములలో సత్కారములొంది, గోడే గజపతిరావు ప్రభునొద్ద ముప్పది సంవత్సరములుండి బహుగౌరవములు పడసెను. బంధకవితయందును, జిత్రకవితయందును, సమస్యాపూరణ మందును, అవధానములందును రంగళాయికవి మంచినేర్పు గలవాడు. శ్రీ సూర్యరాయనిఘంటు కార్యస్థానమున గొంతకాలము పండితపదవిలో నుండెను. అంతే, యాయన గావించిన భృతకవృత్తి మఱి, తదితరమైన యుద్యోగము లేవియు జేసియెఱుగడు. ఉన్న దానితో సరిపెట్టుకొని, క్లుప్తముగ సంసారము దిద్దుకొనుచు, నయినవానిని కానివానిని యాచింపకుండ మర్యాదగ గాలక్షేపముచేసిన సంతుష్టద్విజుడాయన. కృతులు నరుల కీయలేదు. శతకములతో భగవద్ధ్యానము చేసికొని తరించెను. సంస్కృతాంధ్రములలో మొత్తమాయన పది పండ్రెండుశతకములు వ్రాసికొనెను.


అనంతభట్టు రచించిన 'భారతిచంపువు' సొంపుగా దెలిగించెను.భోజరాజు 'రామాయణచంపువు' కూడ దెలిగింప మొదలిడి బాలకాండముదాక రచించెనని వారి కుమారులవలన నేను విన్నవిషయము. రంగశాయికవిగారి కీర్తి శాశ్వతముగ నిలుపుటకు వారి 'భారతచంపువు' ఒకటిచాలును. ఆకావ్యములోని పద్యగద్యములసంఖ్య యించుమించు 1250 - శబ్దసంస్కార మెచ్చటను జాఱలేదు. కవిత ధారావాహికమై 'అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి' గారికి సరిపడినకుమారులు వీరనిపించుచున్నది. చంపూ భారతావతారికలో రంగశాయికవి గ్రంథ .................... ................. .............. ............... ............................

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు)