పుట:AndhraRachaitaluVol1.djvu/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అల్లంరాజు రంగశాయి కవి

1860 - 1936

ఆరామ ద్రావిడ శాఖీయ బ్రాహ్మణులు. హరితసగోత్రులు. ఆపస్తంబసూత్రులు. తల్లి: చిన్నమాంబ. తండ్రి సుబ్రహ్మణ్యకవి. జన్మస్థానము: పీఠికాపుర పరిసరమున నున్న చేబ్రోలు. జననము: 1860- రౌద్రి సంవత్సర నిజాశ్వయుజ శుక్లతృతీయా సౌమ్యవాసరము. నిర్యాణము: 1936. యువ చైత్రబహుళదశమి. గ్రంథములు: 1. శ్రీమదాంధ్రచంపూభారతము (ఆంధ్రీకరణము. 1913 ముద్రి) 2. రామాయణచంపువు (సంపూర్ణముగ ముద్రణమునకు రాలేదు) 3. రఘురామ శతకము. 4. పరమాత్మ శతకము 5. సర్వేశ్వర శతకము. 6. గోవింద శతకము. 7. లక్ష్మీ శతకము. 8. మాధవ శతకము. 9. కుక్కుటలింగ శతకము. 10. గోపాలస్వామి శతకము. 11. మల్లికార్జున శతకము. సంస్కృత గ్రంథములు: 1. దైవస్తోత్రరత్నావళి. 2. నారాయణానందలహరి. 3. కవిమానసరంజని.

పండితుని పుత్రుడు పండితుడగు సంప్రదాయములే దనుకొందురు. రంగశాయికవిగారి తండ్రి సుబ్రహ్మణ్యకవి. ఆయన భద్రాపరిణయాది మహాప్రబంధ ప్రణేత. అతనితండ్రికవి. అతనితండ్రికవి. వీరిచరిత్రములన్నియు 'ఆంధ్రకవులచరిత్ర' గ్రంథము నలకరించియున్నవి. వీరివంశమున దరమున కొకకవి చొప్పున వచ్చుచున్నారు.

రంగశాయికవి సంస్కృతాంధ్రములు తలస్పర్శిగ జదివెను. కవితయీయనకు నిసర్గముగ జనించినది. ఈయన ధారణాబలము, మేధాపటుత్వము శతవధానాష్టావధానములను నిరాఘాటముగ జేయించినది. అపారమైన శ్రీనారాయణభక్తి రంగశాయికవిగారిచే నరాంకితము గావింపనీయలేదు. కవులలో నిట్టి సాత్త్వికమూర్తి తఱచు కనుపట్టడని పెక్కురువలన వినుకలి. అందఱచేతను 'చాదస్తపుబ్రాహ్మణు' డనిపించు