పుట:AndhraRachaitaluVol1.djvu/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెలికిదీసి వెలువరించిన మహాత్ముడీయన. రామయ్యపంతులుగారి జీవితకృతిలో 'ఆంధ్ర సాహిత్యపరిషత్తు' రసవదధ్యాయముగాన నీసందర్భమున దానిని స్మరించుకొనుట సముచితము.

పరిషత్తున కాదిలో నాంధ్రసంస్థానము లెన్నియో యార్థిక సాహాయ్యమొనరించినవి. పీఠికాపుర ప్రభువులు, బొబ్బిలిమహారాజులు, వేంకటగిరి సంస్థానాధిపతులు, ఉయ్యూరు జమీందారులు, తుని రాణిగారు మున్నగు వార లెందఱో చేయూత నిచ్చిరి. దానితో నాంధ్రసాహిత్యపరిషత్తు లేచినది. ఆంధ్రరచయిత లెల్లరు దాని యుత్పత్తికి గర్వించిరి. ఆంధ్రదేశమునందలి తాళపత్త్ర గ్రంథములు, ప్రాచీన శాసనములు సంపాదించి సంశోధించి ముద్రించుట కీపరిషత్తు గొప్పపనిచేసినది. నేటికిని జేయుచున్నది. మొట్టమొదట నీపరిషత్కార్య నిర్వాహకసంఘములో బేరుమోసినపండితు లెందఱో ప్రవేశించిరి. ఆకారణమున నీసంస్థ విశేష విఖ్యాతి గడించుకొనినది. గ్రాంథికాంధ్రమునకు బరిషత్తు చేసినసేవ యపారము. అఖండము.

రామయ్యపంతులుగారు మొక్కవోని గ్రాంథి కాంధ్రవాదులు. గిడుగు రామమూర్తి పంతులుగారికి వీరికి జరిగిన వాద ప్రతివాదములు జగమెఱిగినవే. రామయ్యపంతులుగారి గ్రాంథికవాద సారాంశమిది. "దేశమభివృద్ధి నొందినకొలది జనుల యాచారములు, భాషలు మొదలగు వానిలోనున్న యంతర్భేదములు నశించి క్రమముగా నవి యేకారమును బొందుట లోకమర్యాదయైయున్నది. దీనికి వ్యతిరేకముగా గ్రామ్యవాదులు చిరకాల సంప్రాప్తమైన యేకాకార గ్రాంథికాంధ్రభాషను రూపుమాప యత్నించుచున్నారు. వీరియత్నము కొనసాగినచో నాంధ్రవాజ్మయము భావికాలపు దెలుగువారికి దురవగాహమై పతనము లేక నశించి పోవలసివచ్చునుగదా ? లోకహితార్థము మహాకవు లించుమించుగ వేయిసంవత్సరములనుండి సంపాదించి మనపరముచేసిన సర్వాంగ