పుట:AndhraRachaitaluVol1.djvu/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సుందర వాజ్మయ భాగ్యమును మన మనుభవింపలేక పాడుచేసుకొన్నవార మగుదుము. తాను సంపాదించుట లేదుగదా పెద్దలు సంపాదించి యిచ్చిన దానినైనను నిలుపుకొనలేక చెడగొట్టుకొన్న వాడెట్టి ప్రజ్ఞాశాలియో యూహింపుడు. పెద్దలు కట్టిన దివ్యభవనమును బడగొట్టుకున్న పిమ్మట నిలువనీడ యెద్ది ? ఎద్దియో యొకకొంప కట్టుకొందమందురా ? దానికి సాధనసామగ్రియేది ? అదియెన్నటికి గొనసాగును ? ఇకముందు గ్రామ్యకవులు గ్రంథములు రచింపవలసినది గ్రామ్యభాషయందేకదా ? ఇదిబహుముఖములుగా నున్నది. అందేభాషలో రచింతురు ? గోదావరీ కృష్ణా మండలములలో విద్యాధికులు వాడుచుండు సంభాషణభాషయందట. ఆభాష యేకాకారముగ నున్నదా ? ఆభాషలోనున్న గ్రంథము లితరమండలములలో నున్న తెనుగువారికి సులభముగా నర్థమగునా ? గ్రాంథికభాషను బోగొట్టితమకర్థముగాని గ్రామ్యభాషనేర్చుకొమ్మని బలవంతపెట్టుట వీరికి ముల్లుదీసికొఱ్ఱుకొట్టినట్లగును గదా ? ఈవృథా ప్రయత్న మేల ? వ్యావహారిక భాష సుగమమను గ్రామ్యవాదులలో నెంతమంది చంద్ర శేఖరశతకము చదివి యన్వయింపగలరో? భాషీయదండకమను చిన్న పొత్తము నెంతమంది యర్థముచేసికొన గలరో? అధికసంఖ్యాకులకు సులభముగా దెలియుటే ప్రయోజనమైనచో విద్యాధికుల వాడుకభాషయేల? విద్యావిహీనులైన ప్రాకృతజనుల భాష యేలకూడదు? ఏభాషను గ్రాంథికభాషగా గ్రహించినను గాలక్రమమున వానిరూపములు స్థిరపడి యిప్పటిగ్రాంథిక భాషయందుగల వన్న దోషము లన్నియు దానికిని బుట్టునుగదా? అట్టిచో నీనిరర్థకప్రయత్న మేల?

"ఆధునికాంధ్రవాజ్మయవికాసవైఖరి."

ఇది యటుంచి పంతులుగారి శాసన పరిశోధనశక్తి ముచ్చటించు కొందము. వీరు 1200 శాసనములవఱకు బరిశోధించి తత్తద్విశేష