పుట:AndhraRachaitaluVol1.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతి రామయ్య

1860 - 1941

వెలనాటి బ్రాహ్మణుడు. కౌశికగోత్రుడు. కృష్ణయజుర్వేది. ఆపస్తంబ సూత్రుడు. తండ్రి: రామయ్య. తల్లి: సోమమ్మ. జననము: 18-7-1860 సం|| రౌద్రినామ సంవత్సరమున నాషాఢ బహుళ అమావాస్య సూర్యోదయకాలము. నిధనము: 9-2-1941. అభిజనము: అమలాపురము తాలుకా ముక్తీశ్వరము. మృతునొందు కాలము నాటికి వీరి వయస్సు 81 సంవత్సరములు. విరచిత గ్రంథములు: 1. ముక్తీశ్వర శతకము. 2. ఉత్తరరామచరితము. 3. ఆంధ్రచంపూ రామాయనము 4. అమరుకము. 5. ఆంధ్రవాజ్మయ వికాసవైఖరి. 6. శాసనపద్యమంజరి (2 భాగములు) 7. బాలరామాయణము. 8. Defence of Literaary Telugu. 9. Dravidian Lexicography- మున్నగునవి. దేశచరిత్ర స్వరూప ప్రయోజనములు - రాజరాజు, నందంపూడి శాసనము-ఆంధ్ర నిఘంటు నిర్మాణపద్ధతి- బమ్మెర పోతరాజు నివాసస్థానము- ఉత్తరరామచరిత నాటకరస విచారము మొదలగు విషయములపై ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో బ్రకటింపబడిన వ్యాసముల మొత్తము 50. 1. The Southern School of Telugu Literature. 2. Krishnaraya మొదలగు వ్యాసములు ఆంధ్రేతిహాస పరిశొధన మండలివారి పత్రికలో బ్రకటింపబడినవి. 5. 'ఎపిగ్రాఫికా ఇండికా ' లో వెలువరింపబడిన వ్యాసములు 8. ఉపోద్ఘాతములు వ్రాసిన గ్రంథములు: రాయవాచకము, సర్వేశ్వరశతకము, కవిజనాశ్రయము, విప్రనారాయణ చరితము, మన్నారుదాసవిలాసము మొదలగునవి.

ఆంధ్రభాషోద్ధరణాభిలాషులగు కొందఱు ప్రభువులచేతను, ఆంధ్రభాషాప్రవర్ధకులగు కొందఱు ప్రముఖులచేతను 1911 లో ఆంధ్రసాహిత్యపరిషత్తు స్థాపింపబడినది.తదధ్యక్షులగు జయంతి రామయ్యపంతులు గారు నాటినుండియు ంవిచ్ఛిన్నముగ నాంధ్రిసేవ చేయుచున్నారని తలంపవలయును. 'సాహిత్యపరిష' దుత్పత్తికి బూర్వము పేర్కొన