పుట:AndhraRachaitaluVol1.djvu/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాయంతరంగమున నొకవిచిత్రమైనయభిలాషము సైతమున్నది. అది యేమనగా వ్యానేశ్వరుడే మాకు గులదేవత. ఆ వ్యాసభట్టారకుని యెడల నాకెంతయో భక్తికలదు. సంస్కృతభాషయందు వ్యాస ప్రోక్తమైయున్న మహాభారతమును దెనుగునగూడ వ్యాసప్రోక్త మొనరింపవలయు నని నాకు ముచ్చటగా నున్నది. ఆయీ కారణములచే నేనీగ్రంథమును రచింప నారంభించితినిగాని మఱియొకటిగాదు. నాయీగ్రంథము శ్రీమహాభారతమునకు మూలానుగుణమగు నాంధ్రీకరణమునుగాదు. ......"

వ్యాసమూర్తి శాస్త్రిగారికవిత్వము అన్వయకాఠిన్యము కలిగి యభూతపూర్వ మైనదని కొందఱవిమర్శ. ఇంచుమించుగా నందఱ యభిప్రాయము నదియే. దానికి గారణము తొట్టతొలుత బేరుకొంటిని.వ్యర్థపదములు వారికవితలో నుండవు. అదిగాక భారతనవనీతము నిర్వచనము. మొత్తముమీద శాస్త్రిగారికవితారచనము విలక్షణతాపాదకమనిచెప్పవలయును.

ఎఱుగక మేను, గిన్క ధరణీశుల నే బొరిగొన్న పాతకం

బఱుత మనన్ ఋచీముఖు లావర మిచ్చిరి ; తత్సగోంత మే

పఱగు శమంతపంచకము ; భారతసంగరమందె సెల్లె ; రూ

పఱి రిరుతొమ్మిదుల్బలము లక్షపదాదిమలైన యూహినుల్. "భారతనవనీతము"

వీరిపద్యములన్నియు నిట్లే నడచును. శాస్త్రిగారు తమకుమారుని వివాహమున కాహ్వానపత్రికపై వ్రాసిన యీపద్యమెంతపొందికగా నిమిడినదో!

వినుడీ ! కీలకమాఘశుద్ధదశమిన్ వేగ న్విధిన్ గుంభరా

శిని మత్పుత్రుడు కోటవెంకటసుతన్ జేనందికో వృద్ధమా

ననమయ్యెన్ జరుగున్వివాహము జగన్నాథాచలంబందు గా

వున విచ్చేయుడు ! బందులీనవయుగంబున్ లెస్సదీవింపగన్.