పుట:AndhraRachaitaluVol1.djvu/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈవేంకటకవి సాహిత్య వివాదములు మొదలగునవి యానాటి ఆంధ్రభాషాసంజీవని, హిందూజన సంస్కారిణి (చెన్నపురి) బుధవిధేయి మున్నగు పత్రికలలో గననగును.

మండపాక పార్వతీశ్వరశాస్త్రి యీవేంకటకవి నిటు లుట్టఠించెను:

మచ్చరము లేదు కవితలో మచ్చలేదు

మచ్చయిన లేదు నుతికి సొమ్మచ్చలేదు

మచ్చయన మెచ్చదగు పుట్టుమచ్చగాన

మచ్చవేంకటకవినామ మచ్చమయ్యె.

     20. 2. 1894 సం. బొబ్బిలి


       -----------