పుట:AndhraRachaitaluVol1.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోని పురుషోత్తమ పురములో "సబురిజిస్ట్రారు" గా బనిచేయుచుండిన వేంకటకవి భాషమీద మక్కువతో , పర్లాకిమిడి కళాశాలలో ప్రధాన పండితపదవి లభింపగా నది గ్రహించెను. అది మొదలు వేంకటకవి సారస్వత వ్యవసాయమునకొక మెఱుగు గాలము.ఈయన రచనలు ప్రధానముగా నాటి అముద్రిత గ్రంధ చింతామణి (నెల్లూరు) పురుషార్ధ ప్రదాయని (బందరు) పత్రికలలో గాన నగును. మన వేంకటకవికి సమస్యా పూరణములపై వేడుక మెండు. "వార్తాలహరి" యను పత్రికలో త్రిపురాన తమ్మయకవి (ఆంధ్ర దేవీభాగవతగ్రంధకర్త) యొసగిన "ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్" అను సమస్యకు వేంకటకవి వ్రాసిన పూరణములెట్టి మధురధోరణిలో నున్నవో చదువుడు. ఏకారణముననో యివి వేంకటకవి తనశిష్యుని పేర వెలువరించెను.

క. మద్యమ్ము ద్రావినవో

విద్యున్నేతల గుఱించి వెత జెందితివో

విద్యావిహీన! యెక్కడి

ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్!

క. విధ్యానిధి నిటు డొకసతి

జోద్యమ్ముగ గూడునెడ రజోగుణ మిషచే

హృద్యమ్మగు నక్కోమలి

ప్రద్యుమ్నాగారమందు భానుడువొలిచెన్.

విద్యాధరార్చితా! యర

పద్యమ్మున నీసమస్య పరగ ముంగితున్

హృద్యమ్మగు ప్రాగ్గిరి దీ

ప్రద్యుమ్నాగారమందు భానుడు వొలిచెన్.