పుట:AndhraRachaitaluVol1.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహమ్మదీయ ప్రభుసైన్యములో సరదారులుగా నుద్యోగించిరట. ఈ కవి తండ్రి గంగయ్య పటాలములో బనిచేయుచుండగా జాల్నాపురిలో నీయన జన్మము తటస్థించెను. ఈగంగయ్య తెలుగు సారస్వతము కొంత యెఱిగినవాడు. బ్రౌనుదొరకు సమకాలికుడు. నాడు జిల్లా జడ్జిగానున్న బ్రౌనుతో రాజమహేంధ్రవరమున నున్నపుడు చెలిమి కలుపుకొని మన్ననలు పొందెను. ఈసందర్భము వేంకటకవి తన వైదర్భీపరిణయ కావ్యమున నిటులు ముచ్చటించెను.

శా.సీ.పీ.బ్రౌన్ దొరగారు మండలపు జడ్జినుప్రమేయంబునం

దేపారం జని గంగయాహ్వయుడు హాయింగాంచి తానాంధ్ర వి

ద్యాపాండిత్యము మేటి గ్రంధపఠనాద్యస్తోక నైపుణ్యమున్

జూపెన్ రాజమహేంధ్ర పట్టణమునన్ సూర్యుత్తముల్ మేలనన్.

ఈ వేంకటకవి మూడేండ్ల పసిప్రాయమున నుండగా "జాల్నా" లో నొకచోరుడు మిఠాయిపొట్లము తినజూపి యెత్తుకొనిపోయి, యొడలి బంగారము నూడ బెరికికొని దవ్వుల నొక పాడునూతిలో బాఱవైచెనట. ఆపసిబిడ్డ తండ్రులు సైనికోద్యోగులగుటచే పలువురు నాలుగు మూలలకు వెళ్ళి వెదుకగా, నీరులేని పాడునూత నేడ్చుచున్న పిల్లవానిని బయటకులాగి బుజ్జగించుచున్న బాటసారులు, వారికాబిడ్డ నిచ్చి బహుమానితులయిరట. పసిబిడ్డ చెవుల నంటుజోళ్ళు చోరునిచే ద్రెంచ బడుట కారణముగా ,చెవితమ్ములు వేంకటకవికి మఱి కలియలేదు. ఇట్టి గండము గడచిన పసిబిడ్డ పండితకవి కావలయునో?

వేంకటకవి తొట్టతొలుత దండ్రికడనే తెనుగు పొలుపులు గుర్తుపట్టెను. సంస్కృతము తెలికిచెర్ల శివరామశాస్త్రిగారి కడ నభ్యాసము. శ్రీకాకుళము హైస్కూలులో ఆంగ్లభాషాపఠనము-గంజాము మండలము