పుట:AndhraRachaitaluVol1.djvu/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు బ్రక్కనున్న వారు విఱుగబడి నవ్విరి. అధికారి సరసుడగుటచే వేంకటకవి యాత్మగౌరవమునకు సంతసించెను.

ఇట్టిదే వేఱొక సన్నవేశము. శ్రీ విక్టోరియా మహారా-యస్తమించిన సందర్భమున సర్లాకిమిడి కళాశాలలో నొకపరామర్శసభ జరిగెను. ఆయూరి దాజుగారును, మహోన్నతులయిన యాంగ్లేయోద్యోగులును, కవులును బెక్కు రక్కడ నుండిరి. మన వేంకటకవి యాకళాశాలలో బ్రధాన పండితుడుగా నుండెను. మహారాజ్ణి నిర్యాణమును గూర్చి వేంకటకవియు గొన్ని పద్యములు రచించి సభలో జదువ నుండెను. కొంతతఱికి వారివంతు రాగా గాలిజోడువీడక గద్దెపైక్కో ముద్దులొలుకు గళస్వరముతో దన మధుర పద్యములు పఠింపమొదలిడెను. అప్పుడు రాజుగారి కార్యదర్శి చింతలపాటి హనుమంతరావుపంతులు గారు తొందరపాటున లేచి దేశభాషాపండితులకు వర్తమానగౌరవాచార ఫక్కి తెలియదనియు, నిట్టి వారిని వేదిక నెక్కింపరాదనియు నొక్కిసభలో జెప్పెను. అంతట వేంకటకవి యేదో బదులు పలుకుచుండగా, ఆకళాశాలలో నపుడు ప్రధమ సహాయోపాధ్యాయులుగా నున్న శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారు లేచి యిట్లు పలికెను. "వేంకటకవి సామాన్యకవిగాకాడు. ఆంధ్ర మండలములో నితనివంటి కవులు చాల తక్కువగానున్నారు. ఇతని కవిత్వ పటుత్వము నేటివారిలో గొందఱకేగాని లేదు. ఇట్టివానికి స్వేచ్ఛ నీయవలయును. "రామమూర్తి పంతులుగారి యీమాటల కచటి సభ్యులు నివ్వెఱపడి చూచుచుండిరి.

పై నుదాహరించిన రెండు ముచ్చటలవలనను మన వేంకటకవి మంచి సమయస్ఫురణమ్ను నిరంకుశత కలవాడనుట స్పష్టము. కవివ్యుత్పన్ను డయినపుడుగాని నిరంకుశత యందగింపదు. కవిత్వము వ్యుత్పత్తి రెండును గలవాడు మన వేంకటకవి.

ఈ కవిపూర్వులు నాటికి రెండునూర్లఏండ్లక్రితము మచలీ బందరు నుండి విశాఖపట్టణమండలములో నున్న శ్రీకాకుళమునకు బోయి