పుట:AndhraRachaitaluVol1.djvu/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మచ్చా వేంకటకవి

1856-1903

తెలగాకొలము. జననము: 1856 సం. రాక్షసనామ వత్సరము. నిర్యాణము: 9 జనవరి 1903. తండ్రి: గంగయ్య. పుట్టినయూరు: నైజాము మండలములోని జల్నా. గ్రంథములు: 1. శ్రీశుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన కుశచరిత్ర, 2. వైదర్భీ పరిణయము, 3. చెన్నకేశవ రామాయణము (రామాయణ సంగ్రహ శతకము), 4. ఛాయాపుత్ర శతకము (శనిస్తవము), 5. రుక్మిణీ నాటకము, 6. ద్రౌపదీ వస్త్రాపహరణము, 7. మయూర ధ్వజోపాఖ్యానము, 8. అంబరీషోపాఖ్యానము (పయి మూడును గాక ప్ర బంధములు) 9. ముఖలింగేశ్వరోదాహరణము, 10. జావళీలు, 11. హరిభజన కృతులు.

మచ్చా వేంకటకవి పేరు తలపుగొన్నపుడు మఱపురాని యీక్రింది విషయము మామిత్రులవలన విన్నది ముందు మనవిసేయవలసియున్నది.

ఇది 1900 సం. ప్రాంతములో జరిగిన ముచ్చట. ఇచ్ఛాపుర గ్రామమున వేంకటకవియు, దర్భా వేంకటశాస్త్రియనుపేరుగల డిప్యూటికలెక్టరు హోదాలోనున్న యొకరును గలసికొనిరి. వీరిరువురు స్వల్పమైన పరస్పర పరిచయము గలవారు. కలసికొనగానే వేంకటశాస్త్రిగారు వేంకటకవినిజూచి "ఓహో,మచ్చాకవి! యెప్పుడువచ్చితి"ననెను. వెను వెంటనే వేంకటకవి "ఓహో, దర్భాశాస్త్రి! మూనాళ్ళయివచ్చితి" నని బదులుపలికెను. అపుడు కలెక్టరు హోదాలో నున్న పెద్దమానిసి "వేంకటకవిగారూ! వేరుగా దలంపకుడు. మీరు వయస్సున జిన్నలగుటచే జనవుగొని యటులు సంబోధించితి" నని సర్దుకొను చుండగా వేంకటకవి యందుకొని "తామేల యటులు భావించితిరి? "వేంకట" శబ్దముపయి మీకనాదరభావ ముండెనేమో యనుకొని యిటులు సంబోధించితి" నని ప్రత్యుత్తరము చెప్పెను. ఈ సమయ స్పురణ