Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పటి కీయనవయస్సు పదుమూడేండ్లకు మించదు. ఈదిగువపద్యము ప్రస్తుతకవిగారి పుట్టుకను దెలుపుచు నెంతయందముగా నడచినదో పరిశీలింపుడు.

గౌతమి గట్టి కాలువలు 'కాటను' ద్రవ్వినకాలమందె సం

భూతుడ నైనవాడ బదుమూడగు నేడులయీడుతల్లికిన్:

మాతకు లేమి బా: లచట మంటిని మ్రోసెడియుప్పరమ్మలే

ప్రీతిని నన్ను జన్గుడిపి పెంచిర టేమి ఋణానుబంధమో?

వసుకవిగారికృతులలో 'భక్తచింతామణి' జీవము గలకృతి. దీనిలోని పద్యములు చాలమందికి గంఠస్థములు. భక్తచింతామణి సామాన్య శతకముకాదు. "భావగాంభీర్యమందును దత్త్వబోధనమందును భక్తచింతామణి పద్యములు కొన్ని ప్రపంచ సాహిత్యమందలి యేకవితకును దీసిపోవు" అని విమర్శకులు వ్రాసియున్నారు.

తలిదండ్రుల్ బలె దప్పులోగొనుచు వాత్సల్యంబునంబ్రోతు: నె

చ్చెలియుంబోలె సుధామయోక్తులను మానేమంబెఱింగింతు: కే

వలధర్మప్రభువట్లు నీప్రజలయిబ్బందుల్ తొలగింతు: ని

న్నెలమిం గొల్వమి మాయభాగ్యదశగాదే, భక్త చింతామణి!

సేవింతున్ భవదీయపాదజలరుట్చింతాను సానంబుతో

దేవా! మందు: ననామయత్వము ప్రసాదింపంగదే మేనికిన్

బ్రావృణ్మేఘవు బ్రావుగల్గినను, దానంబేర్చునే వృక్షమున్

నీవుండన్ హృదినాకు వ్యాధిభయమున్నే? భక్త చింతామణీ!

మున్నగు సనర్ఘమణులకు దావల మీశతకము. ఇది భక్తిప్రధానమైన దైనను ననేకవిషయము లిందు సంధానింపబడినవి. పద్యభావములన్నియు నుదారములు. భాషామృదుల గంభీరము. తెలుగున 'భక్తచింతామణి' వలె నధికముగ నమ్ముడుపడిన గ్రంథములు తక్కువ.

సుబ్బారాయకవిశేఖరులు సూక్తిమధానిధులు. ప్రౌడతకు, భావసంపదకు వీరికవిత నిదానము. భట్టనారాయణుని 'వేణిసంహారము' వీరాంధ్రీక