పుట:AndhraRachaitaluVol1.djvu/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రించిరి. ఆతనిశైలి ఈయనకు సరిపడినది. అభిజ్ఞానశాకుంతలము, మల్లికామారుతము, ప్రబోధచంద్రోదయము, విక్రమోర్వశీయము, కుందమాలమున్నగునాటకము లనువదించిరి. ఇవన్నియు దెలుగువారికి శిర:కంపన కారణములు, ఆంధ్రరంగస్థలములకు నలంకారములు, విశ్వవిద్యాలయములకు బాఠ్యములునై యశస్సు నార్జించుకొనినవి. అన్నినాటకములకంటెను వీరి 'వేణీసంహారము' వినుతి గనినది. సుబ్బారాయుడుగారు చిన్ననాట నాటకములలో నభినయించువారట. వేణీసంహారమున ధర్మరాజపాత్రమును దామే నటించినట్లు చెప్పుదురు. ఈకళాభిమానమే యిన్ని నాటకములు వ్రాయించినది. నాటకకర్త నటకుడైనగాని నాటకము రసవత్తరముగా సంఘటింపలేడు. భవభూతికూడ నటకుడైనట్లు చారిత్రకులు చెప్పుదురు. సుబ్బారాయుడుగారు పద్యములు చక్కగా జదువు నలవాటు కలవారు. చిలకమర్తి లక్ష్మినరసింహముగారు 'స్వీయచరిత్ర' లో నిట్లువ్రాయుచున్నారు: పద్యములు చదువుటలోను దండకములు చదువుటలోను మిక్కిలి నేర్పుగల సుబ్బారాయుడుగారి నోటనుండి వినినప్పుడు నాయొడలు పరవశమైనది.

రసానుగుణమైన శయ్యాసౌభాగ్యము వీరి కవితకు నిసర్గజమయిన సుగుణము. వేణీసంహారము లోని యీ భీమావాక్యము నరయునది.

తత ఘూర్ణద్ఘట వార్థి మధ్య విలుఠన్మందాచలధ్వాన ధీ

రత గోణాహతమై జగత్ప్రళయ గర్జన్మేఘ సంఘట్ట చం

డత దృష్ణోగ్రరుషాగ్ర దూత కురురాణ్ణాశంకరోత్పాత

నతి! మత్సింహరవానుకారి రణనిస్సాణం బిదే మ్రోగెడన్.

మరల, దుర్యోధనుడు తండ్రిని బాసిన యశ్వత్థామను బరామర్షించు నీవిలాపవాక్యమునుగూడ నరయునది.

దగ్గఱ రమ్ము; నాకతన దండ్రికి బాసినబిడ్డవై తె? నన్

బిగ్గ గవుంగిలింపు సఖ! నీ కడుమెత్తని మేను హత్తగా