పుట:AndhraRachaitaluVol1.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరునకు సంస్కృతభాషాదేశికుడై యలరారిన యదృష్టవంతుడు. రామనామసంస్మరణము, రామరాయసందర్శనము నను దినకృత్యములుగా నెంచి పవిత్రజీవయాత్ర నెఱపినపండితుడు.

దేవులపల్లి వంశీయు లెల్లరు విద్వత్కవులు. పీఠికాపుర రాజ్యస్థాపకులు శ్రీ రావు తెనుంగురాయణింగారి యాదరణముచే వీరివంశస్థులు పిఠాపురమున బ్రవేశించిరి. సుబ్బరాయశాస్త్రిగారి తండ్రి గొప్పపండితుడు. శాస్త్రులుగారు పితురం తేవాసులు. వారికడ గావ్యనాటకాలంకారాదులు, జ్యోతిర్విద్య నధికరించిరి. కవిత్వాభిరుచి యుగ్గుబాలతో బెట్టినది. ఇక విశేషమేమన, అశువులో బ్రబంధశైలి శాస్త్రిగారి కలవడినది.

1879 లో శ్రీ మాన్ మాడభూషి వేంకటాచార్యులవారు పిఠాపురాస్థానమున నవధానము గావించిరి. అప్పుడు గంగాధర రామరాయేంద్రులు "మనయాస్థానమున నిట్టియవధానముచేయు ప్రతిభావంతు లుండి రే" యనిప్రశ్నించిరట. మరునాడు దేవులపల్లి సోదరుల శతావధానము ప్రారంభమైనది. అనన్యసామాన్యమగు కవితాధారతో నాయవధానము జయప్రదముగా నెఱవేరినది. వేంకటాచార్యులవారు సోదరకవుల ప్రతిభకు నివ్వెఱపోయిరి. మహారాజు తన సంస్థానకవుల శక్తికానందపడెను. అప్పటినుండియు నాస్థానమున వీరిపేరు మాఱుమ్రోసినది. సుబ్బారాయశాస్త్రిగారు "రావువంశముక్తావళి" సంస్కృతమున సంతరించిరి. అదిమహారాజు 1882 లో గృతినందెను. అసందర్భముననే ఈకవిరాజున కామహారాజు "రాజ్యమిచ్చితి బుచ్చుకొ"మ్మనెను. "నుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్?"

1890 లో గంగాధరు డస్తమించెను. ప్రభువియోగము భరింపలేక మనకవి పీఠికాపురాంగ్ల పాఠశాలోపాధ్యాయపదవి విడిచి యింట గూర్చుండెను. ప్రభుభక్తి యిట్లుండవలయును. సుబ్బారాయశాస్త్రి గారి తమ్ములు తమ్మనశాస్త్రిగారియెడలను బై విషయము లుపలక్షణ