పుట:AndhraRachaitaluVol1.djvu/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేవులపల్లి సోదరకవులు

1853-1909, 1856-1912

అగ్రజులు: దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రులవారు. తమ్ములు: తమ్మన శాస్త్రియను నామాంతరముగల వేంకటకృష్ణశాస్త్రిగారు. మొదటి వారి జననము: 1853 సం. నిధనము: 1909 సం. రెండవవారి పుట్టుక: 1856 సం. నిర్యాణము: 1912 సం. కూచిమంచి తిమ్మకవి కడకాలమున నివసించిన చంద్రమపాలెమున (గోదావరి మండలము) వీరి మనుగడ- తెలగాణ్య వైదిక శాఖీయులు. కౌండిన్యసగోత్రులు. తండ్రి: వేంకటకృష్ణ శాస్త్రి. మహేంద్రవిజయము (ఆంధ్ర ప్రబంధము) రావువంశ ముక్తావలి (సంస్కృతము-అచ్చుకాలేదు) మల్హణస్తవము (తెలుగుసేత) రామరాయ విలాసము, రామపంచాశత్తు (సంస్కృతము) ఇవి సుబ్బారాయశాస్త్రి విరచితములు - నయనొల్లాసము, యతిరాజ విజయము, రావువంశ ముక్తావళి (తెలుగు కావ్యము, ఆముద్రితము) సకలేశ్వర శతాము, ఇవి తమ్మనశాస్త్రి రచితములు.

వేలుపు రాఘవుండు; పదివేలపురాణము లన్యు నెన్న నీ
యేలిక లెన్న రావుకులు లెప్పటివారల కప్పు డొప్పు భూ
పాళి నిజంబుగా దనకటంచును దేవులపల్లివంశ భూ
పాళి దలంచుచుండు దనపాలిటి కీయభయంబె ప్రాపుగన్.

చూచితిరా సుబ్బరాయశాస్త్రివరుల రామభక్తివిశేషము? రామ భక్తిని మించినది రాజభక్తి. ఈ రెండింటి ప్రాపుచేతను, మహేంద్రవిజయాది మహోత్తమకృతులు రచించి, యాంధ్రదేశమున నక్షయకీర్తి నార్జించి మించిన మహాశయు డీయన. గంగాధర రామరాయేంద్రుడు తనసింహపీఠిపై గూరుచుండబెట్టి "ప్రాజ్యతరంబగురాజ్య మెల్ల నీ, దేగదా సుబ్బరాయసుకవి! యని యఖండసత్కార మొనరించినను అవలిప్తుడు కాని యభిజ్ఞశేఖరు డీయన. సుబ్బరాయశాస్త్రిగా రాంధ్రభోజాభిఖ్యతో వెలయుచున్న నేటి సూర్యరాయమహారాజ