పుట:AndhraRachaitaluVol1.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విధిచే నన్వయించుకొందురని పునరుక్తి సేయలేదు. ఈ సోదరకవుల సౌభ్రాత్రము గొప్పదని చెప్పు కొందురు. తమ్మనశాస్త్రిగా గన్నిటను నాయన్నకు దగిన తమ్ముడు. అవధానాది ప్రదర్శనములలో నన్నగారి కంటె దమ్ముడేమిన్న యని జనశ్రుతి, పాండిత్యమున మాత్రమగ్రజునిదే యగ్రతాంబూలము.

ఈ కవిసోదరులు తమ నాటికి సుగృహీతనాములైయున్న కూచిమంచి వేంకటరాయుడు-శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి-మాడభూషి వేంకటాచార్యుడు-మొదలగువారి పరిచితివలన దెలుగుకవిత్వమున మెలకువలు, కొన్ని క్రొత్త పోకడలు సంగ్రహించినారు. మాడభూషికవిని మించి యవధానము చేసెదమని కృతార్థులైనారు. మదరాసుపుర ప్రముఖలనుగూడ నవధాన ప్రదర్శినమున మెచ్చించిరి. ఎన్నడో పదునాఱవ శతాబ్దికి బూర్వ మంకురితమై, మాడ భూషికవిచే బల్లవితమై, దేవులపల్లి సోదరులచే గోరికితమై తిరుపతి వేంకటేశ్వరాది కవులచే గనిమితమై యీయవధానవిద్యాలత కొన్నాళ్ళు దెలుగుమన్నీల తల లూపించి క్రమముగా వెఱ్ఱితలలు వేయుస్థితికి వచ్చినది.

సుబ్బారాయశాస్త్రిగారు ప్రభుల యభియోగవిజయ వార్త విని వార్తాహరునకు దమచేతుల నున్న బంగారుకంకణములు బహూకారముచేసెనట. ఆయన ప్రభుభక్తి యట్టిది. "మహేంద్రవిజయ" ప్రబంధ మీవిషయమును తార్కాణించును. ఈ "మహేంద్రవిజయము" నవీన వాసన ముమ్మరముగా గల మధురకావ్యము. వీరికృతిసంతతికెల్లనిది మేలుబంతి.మచ్చున కొకపద్యము చాలును.

తొలికోడి తానెయై యెలుగెత్తి మూడుభం

        గుల గుక్కు టీశుండు కొసరి కూసె

నాలమందల కెల్ల నధినేత తానెయై

        పొంకంబుగా నంది ఱంకెవై చె