Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మవరము రామకృష్ణమాచార్యులు

1853-1912

వైష్ణవులు-తండ్రి: కృష్ణమాచార్యులు. తల్లి: లక్ష్మమ్మ. జన్మస్థానము: ధర్మపురి అగ్రహారము (తాడిపర్తి తాలూకా - అనంతపురం జిల్లా). నివాసము: బళ్లారి. జననము: 1853 సం. (పరీధావి కార్తిక శు|| ఏకాదశి) నిర్యాణము: 1912 సం. విరచిత గ్రంథములు, ముద్రిత నాటకములు:- 1 చిత్రనళీయము, 2. విషాదసారంగధరము, 3. పాదుకా పట్టాభిషేకము, 4. ప్రహ్లాద, 5. సావిత్రీ చిత్రాశ్వము, 6. మోహినీ రుక్మాంగద, 7. బృహన్నల, 8. ప్రమీలార్జునీయము, 9. పాంచాలీ స్వయంవరము, 10. ముక్తావళి, 11. చిరకారినాటకము. 12. రోషనారా శివాజీ, 13. వరూధినీ నాటకము. అచ్చుకాని నాటకములు:- 1. ఉషా పరిణయము. 2. సుశీలా జయపాలీయము, 3. అజామిళ (వచన నాటకము), 4. యుధిష్ఠిర యౌవరాజ్యము, 5. సీతా స్వయంవరము, 6. ఘోషయాత్ర, 7. మదనవిలాస నాటకము, 8. ఉన్మాదరామప్రేక్షణిక నాటకము, 9. రాజ్యాభిషేకము, 10. సుగ్రీవ పట్టాభిషేకము. 11. విభీషణ పట్టాభిషేకము, 12. హరిశ్చంద్ర, కన్నడ నాటకములు: 1. ఉపేంద్ర విజయము లేక వామన చరిత్ర, 2. స్వప్నానిరుద్ధ నాటకము.

శ్రీమత్కృష్ణమాచార్యకవికి బూర్వము తెలుగులో స్వతంత్రనంవిధానము గలనాటకములు లేవు. ఉన్న నాటకములు సంస్కృతమున కనువాదములు. ఆ కారణమున నాంధ్రరంగస్థలములు విస్తరించి వెలయలేదు. పాశ్చాత్య సంప్రదాయము, ప్రాచీన సంప్రదాయము నెఱిగి యొకరకమగు క్రొత్తత్రోవదీసి నాటకములు రచించి స్వతంత్ర నాటకరచయితలకు మార్గదర్శి యనిపించుకొనిన మహాశయు డీయన. వీరి కృషిని గుర్తించి గద్వాల మహారాజవరుడు 1910 లో నీయాచార్యకవిని, రత్నస్థగితమగు పతకముతో 'ఆంధ్రనాటక కవితా పితామహు 'డని బిరుదమొసగి గౌరవించెను. విచిత్రసమ్మేళనము గావించి నాటకపాత్రములకు గేవ లాంధ్ర