పుట:AndhraRachaitaluVol1.djvu/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

సన్మానితులైమహోపాధ్యాయ బిరుద మంది తమ వాగ్దేవతాపూజా విధాన మిట్లు నొడివిరి.

ఆవాహనము స్త్రీపునర్వివాహదుర్వాద నిర్వాపణము - ఆసనసమర్పణము కథాసరిత్సాగరము - అర్ఘ్యము ప్రతాపరుద్రీయ నాటకము - పాద్యము మేఘ సందేశాంధ్రటీక - అలంకారము ఆంధ్ర ప్రసన్న రాఘవ నాట్జకాది విమర్శ కింకిణీ గణ శింజాన శారదా కాంచిక - నైవేద్యము శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య.

ఉషా నాటకమున వీరు జీవిత విషయ మిట్లు చెప్పించి కొనినారు.

చాత్ర సహస్త్ర ప్రచారంబుగా నాట
కములు దన్నిగమంబు గఱపినారు
సర్వజ్ఞసింగమ సార్వ భౌముని గద్దె
యెక్కినదొర మది కెక్కినారు
హూణరూపకరసంబుదరంబు నిండార
ద్రావి గుఱ్ఱున ద్రేచి తనిసినారు
టాటోటు గవులు పటాపంచలై మాయ
గాంచిక వాణి కర్పించి నారు
బల్లారిభ కవి పండిత సంఘంబు
మదరాసులో రూపు మాపినారు
కాళిదాసు శకుంతల నేలినారు
మించిన ప్రతాపకృతిని నిర్మించినారు
తగదోకో శాస్త్రిగారి గ్రంధమును గోర
మహిత వస్తు పరాయణ మానసులకు.