పుట:AndhraRachaitaluVol1.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

`109

వినవాడు చదివినట్లే యుండెను. ఆపరిశ్రమము, దానికిదగిన యారోగ్యము, ఆ పాండిత్యము, దానికి దగిన భావనాశక్తి మఱొకనియందు జూడము. ఆయన మాటలాడిన మధు వొలికెడిది. ప్రతి పక్షిని చల్లగా గొంతుకోయువాడు. సభలో నిలబడినచో సింహము. ఆయన రసవత్సంభాషణములు వ్రాయుచో నొక మహాకావ్యము. స్వాతంత్ర్యము నెన్నడు చంపుకొనలేదు. పని లేక యెవరిని దూలనాడలేదు. ఆమేధ, ఆ ప్రతిభ, ఆ హాస్యవిలాసము, ఆ సమయస్ఫూర్తి యితరున కందవు. అవసరమునుబట్టి పెంకితనము జూపెను. ప్రాచీనాచారముల కతీతుడుడు. అట్లని నవీనాచారముల నాశ్రయింపను లేదు. సందర్భానుసారముగా బోయెను. భాషా విషయమునను నిదియేత్రోవ. పాత్రోచితమని వ్యావహారికము వాడెను. గ్రాంధికమును సమర్థించెను. గిడుగువారి వలెగాక వీరు నియమసాపేక్షముగా గ్రామ్యము ప్రయోగింపవలెనని యందురు. భాషా విషయికముగా గొంచె మభిప్రాయభేదమున్నను గురుజాడ అప్పారావు గారి వీరిని కడు గౌరవించిరి. రజ్ఝుల చినసీతారామ స్వామి శాస్త్రిగారును వీరి యభిప్రాయముల నామాతించిరి. బహుజనపల్లి సీతారామాచార్యులవారు వీరి కాచార్యులు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి వీరాచార్యులు. కట్టమంచి రామలింగారెడ్డి ప్రభృతులు వీరికి శిష్యులు. అల్లాడి కృష్ణస్వామి ప్రముఖులు వీరి కాప్తులు.

ఈపుంభావసరస్వతికి లక్ష్మీ ప్రసన్నత తక్కువ. శ్రీనాధుని వలె జివరికాలమున జిక్కులుపడినారు. ఎంతచిక్కుపడియైనను సరస్వతిపూజ నేమఱలేదు. ఇట్టి మహానీయచరిత్రునకు 1927 లో నాంధ్రవిశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుమునిచ్చి సత్కరించుటలో విశేషములేదు.

నెల్లూరుమండలమున కెల్ల దిక్కనవలె గీర్తిదెచ్చిన కవిపండితుడీయన. శాస్త్రులుగారికృతులను బోషించిన రెడ్డివంశీయులయశము శాశ్వతము.వేంకటరాయశాస్త్రిగారు 1919 లో ఆంధ్రసారస్వత సభవారిచే