108
రాది గ్రంధములు తెలుగున వెలయించిరి. కొక్కొండ వేంకటరత్నము పంతులు గారును వీరును హోరాహోరి బోరిరి. శాస్త్రి గారు పంతులు గారి ప్రాన్న రాఘవమును బ్రత్యక్షరము విమర్శించి విడిచిరి. ఆ వాదము ముదురు పాకమున బడి పండితులకు బాధయనిపించినది. దూషణ వాక్యములు తొలగించినచో 'ప్రసన్న రాఘవ విమర్శనము ' ఆంద్రికి స్వర్ణభూషణము. అప్పుడు ప్రసిద్ధిలో నున్న 'అముద్రిత గ్రంధ చింతామణి ' పత్రిక యీభాషా వివాదములను ప్రకటించినది. చింతా మణి సంపాదకులు పూడ్ల రామ కృష్ణయ్యగారు గొప్ప పండిత విమర్శకులు. వేంకటరాయ శాస్త్రి గారికి వీరికి నొకటే ప్రాణము.
శాస్త్రి గారు నాటక రంగమునకు బ్రశస్తి దెచ్చిన కళాహృదయులు. ఇంచుమించు ముప్పది యేండ్లు సంస్కృతాంధ్ర నాటకములు తమ శిష్యులచే బ్రదర్శింప జేసిరి. వీరి సర్వాధ్యక్షతతో నెల్లూర 'ఆంధ్ర భాషాభిమాని సమాజము ' నడచి రజతోత్సవము జరిపించుకొన్నది. పూండ్ల రామకృష్ణయ్యగారు మరణించుటయు, చింతామణి ఆగిపోవుటయు వేంకట రాయ శాస్త్రి గారికి హృదయావేదన హేతువు లైనవి. క్రైస్తవ కళాశాలలో నిరువది నాలుగేండ్ల నుండి పని చేయుచు 1910 లో నా యుద్యోగమునుండి తప్పుకొనిరి. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను బునరుద్ధరించి యెన్నో ప్రాక్తన గ్రంధములు సవ్యాక్యముగా వెలువరించి హాషా సేవ గావించిరి. వేంకట రాయ శాస్త్రిగా రాంధ్రభాషా మధుమధనులు. ఆయనను మించిన పండితులుందురుగాక, ఆయనను కాదనిపించు కవులుండిరిగాక, ఆయన వలె భారతీ పూజ గావించిన మహాభక్తుడు మాత్రము లేడు. ఆయన దెబ్బది యాఱేండ్లు బ్రతికెను. కొన్ని శతాబ్దులు నిలుచు వాజ్మయసేవ చేసెను. అహోరాత్రము లదేపనిగా వ్రాసినవాడు వ్రాసినట్లే యుండెను. చది